• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH STATE ELECTIONS COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR WRITES CENTRAL GOVERNMENT TO ALLOT CENTRAL GOVERNMENT EMPLOYEES TO CONDUCT PANCHAYAT ELECTIONS HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: స్పీడ్ పెంచిన నిమ్మగడ్డ... పంచాయతీ ఎన్నికలపై కేంద్రానికి లేఖ

AP Panchayat Elections: స్పీడ్ పెంచిన నిమ్మగడ్డ... పంచాయతీ ఎన్నికలపై కేంద్రానికి లేఖ

నిమ్మగడ్డ రమేశ్ కుమార్, వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికలకు (Panchayat Elections) సుప్రీం కోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh kumar) స్పీడ్ పెంచారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఎన్నికల రీ షెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ.., ఉద్యోగుల విషయంలో కేంద్రానికి లేఖ రాశారు. ఉద్యోగ సంఘాలు ఎన్నికలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కీలక లేఖరాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలకు సహకరించబోమంటున్నారన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కోరారు. ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ తో పాటు జిల్లా కలెక్టర్లకు సమాచారమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహకరించనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. చివరి ప్రయత్నంగా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటామన్నారు.

    మేం అలా అనలేదు..
    సుప్రీం కోర్టు ఆదేశాలపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. తాము ఎప్పుడూ ఎన్నికలు రద్దుచేయమని డిమాండ్ చేయలేదని.., వ్యాక్సినేషన్ తర్వాతే జరపాలన్నామన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే తమ రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును కాపీని చదివిన తర్వాతే ఎన్నికల విధులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

    ఇక సుప్రీం తీర్పు వెలువరించిన వెంటనే పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మెదటి దశను నాలుగో దశగా, రెండో దశ ఎన్నికలను మొదటి దశకు.., మూడో దశను రెండో దశకు.., నాలుగో దశను మూడో దశకు మార్చిన ఎస్ఈసీ.. మొదటి దశను నాలుగో దశకు రీషెడ్యూల్ చేశారు. రీ షెడ్యూల్ చేసిన ప్రకారం మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈనెల 29కి వాయిదా వేశారు. నిమ్మగడ్డ రిలీజ్ చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9, 13,17,21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

    ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కాకపోవడం వల్లే రీ షెడ్యూల్ చేసినట్లు నిమ్మగడ్డ తెలిపారు. రీషెడ్యూల్ వివరాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు పంపించారు. దీనిపై జిల్లా అధికారులతో సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చిన వెంటనే యాక్షన్ ప్లాన్ లోకి దిగిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తన ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ పై దృష్టి పెట్టిన ఆయన.. సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూశారు. అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించిన వెంటనే రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు