ANDHRA PRADESH STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR WRITES GOVERNOR BISWABHUSHAN HARICHANDAN TO TAKE ACTION ON SAJJALA RAMA KRISHNA REDDY PEDDIREDDY RAMACHANDRA REDDY VIJAYSAI REDDYM BO
SEC vs YSRCP: నిమ్మగడ్డ మరో సంచలనం... సజ్జల సహా మంత్రులకు లాస్ట్ వార్నింగ్... గవర్నర్ కు లేఖ
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల కమీషనర్ (Election Commissioner) , రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda ramesh Kumar) ఈసారి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలనే టార్గెట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసారి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలనే టార్గెట్ చేశారు. అధికారులు సవ్యంగానే ఉన్నా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు తనను దూషిస్తున్నారని.., వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిమ్మగడ్డ.., రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా తనను దూషిస్తున్నారంటూ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పాటు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు లక్ష్మణ రేఖ (ఎన్నికల కోడ్) దాడి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని నిమ్మగడ్డ ఆరోపించారు.
ఇక ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలో ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వం నుంచి జీతంతో పాటు ఇతర సౌకర్యాలు తీసుకుంటూ రాజకీయ పార్టీ కార్యాలయంలో ఉండి తనపై విమర్శలు చేస్తున్నారని నిమ్మగడ్డ పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే తనపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి కూడా తనపై పలుసార్లు విమర్శలు చేస్తూ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని వెల్లడించారు. ఇలాంటి చర్యలను మానుకోవాల్సిందిగా సదరు వ్యక్తులకు సూచించాలని గవర్నర్ ను కోరారు. రాజ్యాంగ ఉల్లంఘనలపై తాను కోర్టుకు వెళ్లే చాన్స్ ఉన్నా.. చివరి అవకాశంగా మీ దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. మరోసారి ఉల్లంఘనలకు పాల్పడుకుండా వారికి సూచనలివ్వాలని కోరారు.
అంతకుముందు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కు లేఖరాసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశించారు. సాధారణ పరిపాలనా శాఖ అధిపతిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తన విధులను సరిగా నిర్వర్తించలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కలెక్టర్లు,ఎస్ పి లు ఉన్నతాధికారులతో ప్రవీణ్ ప్రకాష్ సమీక్షలు జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్న తన సిఫార్సు లేఖలు పట్టించుకోలేదని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈనెల 23న కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని.. జీఏడీకి అధిపతిగా ఉన్న ఆయన తన ఆదేశాలను పట్టించుకోలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అలాగే ఎన్నికలసు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ప్రవీణ్ ప్రకాష్ విఫలమయ్యారని ఆరోపించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.