• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR VISITS GOLLALAGUNTA VILLAGE AND ENQUIRED ABOUT SARPANCH CANIDIDATES HUSBAND DEATH ISSUE PRN

AP Panchayat Elections: టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యపై రంగంలోకి నిమ్మగడ్డ...

AP Panchayat Elections: టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యపై రంగంలోకి నిమ్మగడ్డ...

తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Election Commissioner Nimmagadda Ramesh Kumar) జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎన్నికలపై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలు, దాడులపైనా దృష్టి పెట్టారు. ఈక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో ఎస్ఈసీ పర్యటించారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సబ్బెల పుష్పవతి భర్త శ్రీనివాలరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం తెలుకుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.., విశాఖపట్నం నుంచి కాకినాడకు వస్తూ మధ్యలో గొల్లలగుంటలోని పుష్పవతి నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. అసలేం జరిగిందనేదానిపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది.

    అసలేం జరిగింది?
    గొల్లలగుంటకు చెందిన నేత పుష్పవతి టీడీపీ మద్దతుతో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఈ క్రమంలో ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి సోమవారం అనునామాస్ప రీతితో ఉరివేసుకొని మరణించాడు. శ్రీనివాస్ రెడ్డి మృతిపై ఆయన భార్య పుష్పవతి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ప్రత్యర్థి పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఆయన్ను కిడ్నాప్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ రెడ్డి కాళ్లు చేతులు కట్టేసి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో స్థానికులు ఆయన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఐతే కిడ్నాప్‌కు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గానీ, పుష్పవతి గానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

    ఇది చదవండి: అలా చేస్తే ఊరుకునేది లేదు.. రాజ్యాంగం చెప్పిందే చేస్తున్నామన్న నిమ్మగడ్డ


    ఐతే సోమవారం మధ్యాహ్నం శ్రీనివాస్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ రెడ్డి పీఎస్‌లోనే ఉన్నాడని భావించామని.. కానీ అంతోలనే శవమై తేలాడని కుటుంబ సభ్యులు చెప్పారు.

    జగ్గంపేట మండలం కాండ్రేగల గ్రామ శివారులోని పొలంలో శ్రీనివాస్ రెడ్డి ఉరివేసుకున్నాడు. ఆయన మృతిపై గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు