ANDHRA PRADESH STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR ORDERS THAT TO REMOVE CMO SECRETARY PRAVEEN PRAKASH FROM ELECTION DUTY PRN
SEC vs YSRCP: సీఎం జగన్ కు నిమ్మడ్డ షాక్.., ఏకంగా సీఎంఓనే టార్గెట్ చేసిన ఎస్ఈసీ
నిమ్మగడ్డ రమేశ్ కుమార్, వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) పోరులో రాజకీయ పార్టీల కంటే.., రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh kumar) మరో సంచలన ఆదేశాలిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పోరులో రాజకీయ పార్టీల కంటే.., రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. అటు ఎస్ఈసీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గంటగంటకూ సంచలన నిర్ణయాలతో వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియామకాన్ని ప్రభుత్వం అడ్డుకున్న కొద్దిసేపటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలిచ్చారు. ఈసారి ఏకంగా సీఎంఓనే ఆయన టార్గెట్ చేశారు. సీఎంఓలో ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేసిస్తూ.., సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కు లేఖరాశారు నిమ్మగడ్డ.
సాధారణ పరిపాలనా శాఖ అధిపతిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తన విధులను సరిగా నిర్వర్తించలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కలెక్టర్లు,ఎస్ పి లు ఉన్నతాధికారులతో ప్రవీణ్ ప్రకాష్ సమీక్షలు జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్న తన సిఫార్సు లేఖలు పట్టించుకోలేదని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని నిమ్మగడ్డ ఆదేశం
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈనెల 23న కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని.. జీఏడీకి అధిపతిగా ఉన్న ఆయన తన ఆదేశాలను పట్టించుకోలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అలాగే ఎన్నికలసు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ప్రవీణ్ ప్రకాష్ విఫలమయ్యారని ఆరోపించారు.
సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని నిమ్మగడ్డ ఆదేశం
సీఎం ఫోటోలు వద్దు
ఎన్నికల సందర్భంగా జారీ చేసే కులధ్రువీకరణ పత్రాలు, ఎన్ఏసీల జారీ అంశంపైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్..., ఎస్ఈసీకి లేఖరేశారు. కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తొలగించాలని.. ఈ మేరకు తహసీల్దార్లకు ఆదేశాలివ్వాలని లేఖలో పేర్కొన్నారు. ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ఉండటం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఎస్ఈసీ స్పష్టం చేశారు. అలాగే కుల ధ్రువీకరణ పత్రాలను జారీలో ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం లేకుండా చూడాలని పేర్కొన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.