ANDHRA PRADESH STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR ISSUES ORDERS TO DISTRICT COLLECTORS TO FORM SHADOW TEAMS TO OBSERVE UNANIMOUS VILLAGES DURING PANCHAYAT ELECTIONS PRN
AP Panchayat Elections: ఏకగ్రీవాలపై షాడో టీమ్స్ నిఘా... పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ కీలక ఆదేశాలు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) నిర్వహణకు పటిష్టం ఏర్పాట్లు చేస్తన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్టం ఏర్పాట్లు చేస్తన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య వార్ జరుగుతండగానే ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన కలెక్టర్, ఎస్పీ సహా జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏకగ్రీవాల కోసం రాజకీయ ఒత్తిళ్లు చేసేవారిపై నిఘా పెట్టేలా షాడో బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో షాడో బృందాల సంఖ్యను పెంచి ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏకగ్రీవాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలన్న నిమ్మగడ్డ.., ఎన్ని ఏకగ్రీవాలను దురుద్దేశంతో చూడలేమన్నారు.
ఏకగ్రీవాలపై రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. బలవంతపు ఏకగ్రీవాలపై ఫిర్యాదులు చేసిన రాజకీయ పార్టీల ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు ఎన్నికల కమిషనర్. ఎన్నికల నిర్వహణలో పూర్తిగా రాష్ట్ర సిబ్బందే ఉంటారన్నారు. ఎన్నికలు నిర్వహించదగ్గ సమర్ధత మన సిబ్బందికి ఉందన్నారు. ఎన్నికలకు కేంద్ర సిబ్బందిని రప్పించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగానే జరుగుతాయని తెలిపారు.
ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కమార్ త్వరలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు నిమ్గమడ్డ వెళ్లనున్నారు
ఫిబ్రవరి 1న సాయంత్రం 4.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 7గంటలకు విజయనగరం జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులతో భేటీ అయి ఎన్నికల ప్రక్రియపై చర్చిస్తారు. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో, మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ వెళ్లి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి ఏలూరు చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేస్తారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.