HOME »NEWS »POLITICS »andhra pradesh state election commissioner nimmagadda ramesh kumar and chief secretary adithyanath das meet governor biswabhushan harichandan and discussed about panchayat elections prn

AP Panchayat Elections: అలా జరగడానికి వీల్లేదు... పంచాయతీ ఎన్నికలపై గవర్నర్ కీలక ఆదేశాలు

AP Panchayat Elections: అలా జరగడానికి వీల్లేదు... పంచాయతీ ఎన్నికలపై గవర్నర్ కీలక ఆదేశాలు
ఆదిత్యానాథ్ దాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికలపై (Panchayat elections) గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhushan Harichandan) తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (SEC Nimmagadda Ramesh Kumar), సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ (Adityanath Das) భేటీ అయ్యారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ భేటీ అయ్యారు. ఇద్దరూ ఒకేసారి రాజ్ భవన్ కు వెళ్లిన ఎస్ఈసీ, సీఎస్.., ఎవరికి వారు విడివిడిగా గవర్నర్ ను కలిశారు. సుప్రీం కోర్టు తీర్పు, ఆ తర్వాతి పరిణామాలపు ఎస్ఈసీ.. గవర్నర్ కు వివరించారు. మరోవైపు సీఎస్ కుడా కరోనా వ్యాక్సినేషన్, ఉద్యోగుల అభ్యంయతరాలను హరిచందన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఉన్నతాధికారుల వివరణపై స్పందించిన గవర్నర్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాలని.., ఎన్నికలను సక్రమంగా పూర్తి చేయాలని చెప్పినట్లు సమాచారం.

    ఇక పంచాయతీ రాజ్ ఉన్నతాధికారుల అభిశంసనపై గవర్నర్.., ఎస్ఈసీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ తో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒకేసారి నిర్వహించేందుకు తీసుకున్న చర్యలపై గవర్నర్ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ను ఆరా తీసినట్లు సమాచారం.



    State Election Commissioner Nimmagadda Ramesh kumar, Chief Secretary  Adithyanath Das, Andhra Pradesh Governor Biswabhushan harichandan, Nimmagadda Ramesh Kumar meet governor, Andhra Pradesh news, AP news, Andhra Pradesh Panchayat elections, DGP Gowtham Sawang, Andhra Pradesh Government, AP Government, AP Local Body Elections,  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు, డీజీపీ గౌతమ్ సవాంగ్, గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ, ఏపీ ప్రభుత్వం, డీజీపీ గౌతమ్ సవాంగ్
    గవర్నర్ తో భేటీ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్


    గవర్నర్ తో భేటీ ముగిసిన అనంతరం ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.., ఎన్నికల ప్రక్రియపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సమావేశానికి సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, కమీషనర్ గిరిజా శంకర్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. వీరిపై ఎస్ఈసీ చర్యలు తీసుకున్నా.., ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో సమావేశానికి వచ్చినట్లు సమాచారం.

    State Election Commissioner Nimmagadda Ramesh kumar, Chief Secretary  Adithyanath Das, Andhra Pradesh Governor Biswabhushan harichandan, Nimmagadda Ramesh Kumar meet governor, Andhra Pradesh news, AP news, Andhra Pradesh Panchayat elections, DGP Gowtham Sawang, Andhra Pradesh Government, AP Government, AP Local Body Elections,  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు, డీజీపీ గౌతమ్ సవాంగ్, గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ, ఏపీ ప్రభుత్వం, డీజీపీ గౌతమ్ సవాంగ్
    గవర్నర్ తో మాట్లాడుతున్న సీఎస్ ఆదిత్యానాథ్ దాస్


    ఆయా శాఖల ఉన్నతాధికారుతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:January 27, 2021, 12:32 IST

    टॉप स्टोरीज