ANDHRA PRADESH STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR ACCEPTS UNANIMOUS ELECTIONS IN GUNTUR AND CHITTOOR DISTRICTS AFTER MEETING GOVERNOR BISWA BHUSHAN HARICHANDAN HERE ARE THE DETAILS PR
AP Panchayat Elections: గవర్నర్ ఎంట్రీతో మారిన సీన్.. ఏకగ్రీవాలకు నిమ్మగడ్డ గ్రీన్ సిగ్నల్
నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) సందర్భంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎకగ్రీవాలకు బ్రేక్ వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kumar) తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు మరో కీలకమలుపు తిరిగాయి. ఇప్పటికే పలు వివాదాస్పద నిర్ణయాలు, నాటకీయ పరిణామాల మధ్య తొలి విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎకగ్రీవాలకు బ్రేక్ వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జోక్యం చేసుకోవడంతో ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఎస్ఈసీ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం గవర్నర్ తో భేటీ అయిన నిమ్మగడ్డ ఎన్నికల ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ క్రమంలో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాల ప్రకటన నిలిపేసిన అంశం చర్చకు వచ్చింది. గవర్నర్ ఆదేశాల తర్వాత రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలను ఆమోదించినట్లు తెలుస్తోంది.
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాల ప్రకటనను నిలిపేయాలంటూ ఎస్ఈసీ ఇటీవల కలెక్టర్లను ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించవద్దని స్పష్టం చేశారు. ఐతే ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ప్రకటన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఎస్ఈసీని విమర్శించడమే కాకుండా నిమ్మగడ్డ ఆదేశాలు పాటించవద్దంటూ అధికారులను హెచ్చరించారు. ఆ తర్వాత ఎఎస్ఈసీ.. మంత్రిని హౌస్ అరెస్ట్ చేయాలని డీజీపీని ఆదేశించడంతో వాతావరణం వేడెక్కింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లగా.. హౌస్ అరెస్ట్ పై స్టే ఇచ్చిన ధర్మాసనం.. మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది.
వివాదానికి కారణమైన చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను పరిశీలిస్తే.., ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవమైననట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని పూతలట్టు నియోజకవర్గంలో 49 గ్రామ పంచాయతీలు, గంగాధర నెల్లూరులో 26, నగరిలో 21, చిత్తూరులో 5, చంద్రగిరిలో 4, సత్యవేడులో 5 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లా విషయానికి వస్తే రేపల్లె నియోజకవర్గంలో 17 గ్రామాలు, బాపట్లలో 15, వేమూరులో 12, పొన్నూరులో 10, తెనాలి 7, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.