Home /News /politics /

ANDHRA PRADESH STATE ELECTION COMMISSION TO ISSUE NOTIFICATION FOR MUNICIPAL ELECTIONS IN FEBRUARY HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: ఏపీలో త్వరలో మరో ఎన్నికల నోటిఫికేషన్..? రంగం సిద్ధం చేస్తున్న నిమ్మగడ్డ..?

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) హడావిడి నడుస్తోంది. అనూహ్య మలుపులు, ఉత్కంఠ మధ్య సుప్రీం కోర్టు (Supreme Court) క్లారిటీ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఐతే త్వరలోనే మరో నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. అనూహ్య మలుపులు, ఉత్కంఠ మధ్య సుప్రీం కోర్టు క్లారిటీ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. అధికార వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవాల కోసం ట్రై చేస్తుంటే.., టీడీపీ గట్టిపోటీ ఇచ్చేందుకు చూస్తోంది. తమ ఉనికిని బలంగా చాటడానికి జనసేన, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు షాకిస్తూ మరో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల ప్రకటన వెలువడొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఫిబ్రవరి 22న నోటిపికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 16 మున్ కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీలు, 31 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటితో పాటు డివిజన్లు, వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 21తో పూర్తవుతాయి. ఆ తర్వాతి రోజు నుంచే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో వరుసగా ఎన్నికలు నిర్వహిస్తే ఓ పనైపోతుందని ఎస్ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ఇటీవలే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐతే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

    ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్రంలో తీవ్ర దుమారం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం నడిచింది. చివరకు సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంచాయతీ పోరుకు లైన్ క్లియర్ అయింది. ఇక ప్రభుత్వం కూడా ఎస్ఈసీకి సహకరించాలని నిర్ణయించడంతో ఎన్నికలు సాఫీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు కూడా ఎలాంటి ఇబ్బందులుండవనే భావన వ్యక్తమవుతోంది. ఐతే పంచాయతీ ఎన్నికలు పూర్తైన తర్వాతి రోజే పురపోరుకు సై అంటుండటంతో రాజకీయ పార్టీలు ఆదిశగా దృష్టి పెట్టే అవకాశముంది. పంచాయతీతో పాటు మున్సిపల్ ఎన్నికలకు కూడా ఒకే రకమైన వ్యూహాన్ని అమలు చేసి హిట్టు కొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP Politics, Gram Panchayat Elections, Municipal Elections, Nimmagadda Ramesh Kumar, Tirupati, Vijayawada, Visakhapatnam, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు