ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

Andhra Pradesh Special Status: ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదని, అదో ముగిసిన అధ్యాయం అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 7, 2019, 6:27 PM IST
ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
కన్నా లక్ష్మీనారాయణ ఫైల్ ఫోటో(Image: Facebook)
  • Share this:
ఏపీకి ప్రత్యేక హోదా హామీతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.. అయితే, ప్రత్యేక హోదా అన్న అంశం ఇక కల్లేనా? ఏపీకి స్పెషల్ స్టేటస్ దక్కదా? అంటే అవునంటున్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదని, అదో ముగిసిన అధ్యాయం అని వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఏపీ అభివృద్ధి.. దేశాభివృద్ధి అనే నినాదానికి ప్రధాని కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. ఏపీకి వేల కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందని అన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి పర్యటన సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ నెల 9న సాయంత్రం 4.30గంటలకు తిరుపతి చేరుకోనున్న మోదీ.. సాయంత్రం 5.10 గంటల వరకు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తిరుమల పద్మావతి వసతి గృహానికి చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారని, సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు శ్రీవారి సేవలో పాల్గొంటారని, ఆ తర్వాత రాత్రి 8గంటలకు తిరిగి ఢిల్లీకి పయనమవుతారని కన్నా పేర్కొన్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 7, 2019, 6:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading