Home /News /politics /

ANDHRA PRADESH SPEAKER TAMMINENI SITARAM COMMENTS ON VALLABHANENI VAMSHI MS

రాజీనామా చేయాల్సిందే.. వల్లభనేని వంశీపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు

వల్లభనేని వంశీ

వల్లభనేని వంశీ

పార్టీ ఫిరాయింపులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సభ్యుడైనా పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు.

    పార్టీ ఫిరాయింపులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సభ్యుడైనా పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవన్నారు. సభా నాయకుడిగా ముఖ్యమంత్రి కూడా గతంలో ఇదే విషయాన్ని చెప్పారని.. తాను దానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. వల్లభనేని వంశీ వైసీపీలోకి రావాలనుకుంటే.. రాజీనామా చేశాకే రావాలని అన్నారు. వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్దమైన నేపథ్యంలో స్పీకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వంశీ వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమవడంతో.. ఆయన రాజీనామాపై స్పష్టత రావాల్సి ఉంది.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Andhra Pradesh, Tammineni sitaram, Vallabhaneni Vamshi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు