ఏపీ మంత్రి పదవి రేసులో తెరపైకి కొత్త పేరు.. జగన్ ఖాయం చేశారా?

AP cabinet expansion | జూలై 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసింది.

news18-telugu
Updated: July 11, 2020, 6:03 PM IST
ఏపీ మంత్రి పదవి రేసులో తెరపైకి కొత్త పేరు.. జగన్ ఖాయం చేశారా?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో రెండు కేబినెట్ బెర్త్ లు ఖాళీ అయ్యాయి. ఆ రెండు పదవులను భర్తీ చేయడానికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆశావహుల లిస్టు కూడా భారీగానే ఉంది. ఎవరికి వారు తమను కేబినెట్‌లోకి తీసుకోవాలని లాబీయింగ్ మొదలు పెట్టారు. అందులో అనూహ్యంగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం‌ను జగన్ మంత్రిని చేస్తారనే ప్రచారం జిల్లాలో మొదలైంది. స్పీకర్‌గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం ప్రతిపక్షాల మీద కూడా అప్పుడప్పుడూ విరుచుకుపడతారు. తాను మొదట ప్రజాప్రతినిధినని, ఆ తర్వాతే స్పీకర్ అని కూడా కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడానికి అధికార పక్షానికి అండగా ఉన్న తమ్మినేని సీతారాం కి మంత్రి పదవి ఇస్తే టీడీపీ మీద ఎదురుదాడి చేయడానికి మరో అస్త్రం లభించినట్టు అవుతుందని ఆయన వర్గం పాజిటివ్ దృక్పథంతో ఉంది. తమ్మినేని కూడా బీసీ సామాజికవర్గానికే చెందిన నేత కావడం కలిసొచ్చే అంశం అని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇటీవల వైఎస్ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయించారు. ఆ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జి వి.విజయసాయిరెడ్డిని కూడా పిలిచారు. మంత్రి పదవి గురించి మనసులో మాట ఆయన ద్వారా జగన్ చెవిన వేయడానికేనని చెబుతున్నారు.

మరోవైపు జూలై 22వ తేదీన కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసింది. అంటే శ్రావణమాసం వచ్చిన తర్వాత రోజు. ప్రస్తుతం ఆషాఢ మాసం. ఈ సమయంలో కొత్త పనులు చేపట్టరు. శ్రావణమాసంలో శ్రీకారం చుడతారు. పండితుల సూచన మేరకు జూలై 22న శ్రావణమాసం వచ్చిన తర్వాత రోజే కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 11, 2020, 6:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading