ANDHRA PRADESH SEC NIMMAGADDA RAMESH KUMAR TO ISSUE ANOTHER ELECTIONS NOTIFICATION SOON GIVES CLEAR INDICATIONS AFTER LATEST ORDERS TO CHANGE RATION DOOR DELIVERY VEHICLES COLORS HERE ARE THE DETAILS
AP Panchayat Elections: ఏపీలో మరో ఎన్నికల నోటిఫికేషన్..? ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్లాన్ అదేనా..
నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kumar) స్పీడ్ పెంచుతున్నారు. త్వరలోనే మరో ఎన్నికల నోటిఫికేషన్ (Elections Notifications) విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడ్ పెంచుతున్నారు. త్వరలోనే మరో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంతో ఫైట్ చేస్తూ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్న ఆయన.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది మార్చిలో నోటిఫికేషన్ రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఎస్ఈసీ వాయిదా వేశారు. ఐతే రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ వాహనాల విషయంలో ఎస్ఈసీ జారీ చేసిన ఆదేశాలతో త్వరలోనే నోటిఫికేషన్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల రేషన్ సరుకుల డోర్ డెలివరీ వాహనాలను పరిశీలించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వాటి రంగులు మార్చాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నందున రంగులు మార్చిన వాహనాల్లోనే రేషన్ డోర్ డెలివరీ చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్నట్లు అర్ధమవుతోంది. ఐతే మార్చి 31లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. త్వరలో ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రకటన కూడా ఇచ్చే అకాశముంది. గత ఏడాది ఫిబ్రవరిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ప్రారంభమై నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు. అప్పటికే రాష్ట్రంలో చాలా మండలాలు ఏకగ్రీవమయ్యాయి.
తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఏకగ్రీవాలను అడ్డుకోవడం కోసమే ఎన్నికలు వాయిదా వేసినట్లు అప్పట్లో వైసీపీ ఆరోపించింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నిమ్మగడ్డను ప్రభుత్వం తొలగించడం.. ఆయన కోర్టులో గెలిచి మళ్లీ బాధ్యతలు స్వీకరించడం జరిగాయి. అనంతరం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి నిర్వహిస్తున్నారు. రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చిన నిమ్మగడ్డ.. మరో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు చెప్పకనే చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు మానసికంగా సిద్ధమయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో అమలు చేస్తున్న వ్యూహాలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైన నేపథ్యంలో నేరుగా బరిలో దిగాలని చూస్తున్నాయి. మొత్తానికి ఎస్ఈసీ ఇచ్చిన సంకేతాలతో వచ్చే రెండు నెలలు ఏపీలో పొలిటికల్ పార్టీలకు తీరకలేని పరిస్థితి ఏర్పడనుంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.