ANDHRA PRADESH SEC NIMMAGADDA RAMESH KUMAR TO ANNOUNCE LOCAL BODY ELECTIONS SCHEDULE SOON AND SCHEDULE MIGHT BEGAN AFTER MARCH 14TH 2021 HERE ARE THE DETAILS PRN
AP Local Body Elections: ఏపీలో త్వరలో మరో ఎన్నికల నోటిఫికేషన్... రంగం సిద్ధం చేస్తున్న నిమ్మగడ్డ
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (SEC Nimmagadda Ramesh kumar) ఒకదాని వెంట ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) షెడ్యూల్ ప్రకటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకదాని వెంట ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నఎస్ఈసీ.. రెండో విడత పోలింగ్ పూర్తైన వెంటనే.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పుడు మరో షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు నిమ్మగడ్డ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలను కూడా గతంలో నిలిపేసిన దశ నుంచి కొనసాగించాలా లేక కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలా అనే అంశంపై ఎస్ఈసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయనిపుణులతో చర్చలు జరుపుతోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తున్నట్లు సమాచారం.
గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా.. చాలా మండలాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదింరిచి ఏకగ్రీవాలు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ తు ఫిర్యాదులు కూడా అందాయి. అప్పట్లో ఎన్నికలు వాయిదా పడటంతో ఏకగ్రీవాలు, ఫిర్యాదుల అంశానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉండటంతో ఏకగ్రీవాలు, ప్రతిపక్షాల ఫిర్యాదులపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఎదరుయ్యాయా? అనే అంశంపై నిమ్మగడ్డ ఆరా తీస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు, ప్రస్తుత పరిస్థితులపై జిల్లా కలెక్టర్ల నుంచి ఎస్ఈసీ నివేదిక కోరారు. అలాగే సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ తో కూడా చర్చించారు. మంగళవారం జరిగిన సమావేశంలో మూడో దశ పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ వైఖరిని అడిగి తెలుసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ తర్వాతేనా..?
ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన దాని ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. 13న అవసరమైన చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 14న కౌంటింగ్ పూర్తవుతుంది అదే రోజు సాయంత్రానికి ఫలితాలను ప్రకటిస్తాయి. దీన్ని బట్టి చూస్తే మార్చి 15న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
నిమ్మగడ్డ నిర్ణయం అదేనా..?
ఐతే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొత్త నోటిఫికేషన్ వైపే మొగ్గు చూపుతారన్న ప్రచారం సాగుతోంది. పాత ప్రక్రియనే కొనసాగిస్తే న్యాయనిపుణులతో చర్చలు, నివేదికల అవసరం ఉందని కొందరంటున్నారు. పైగా పంచాయతీ ఎన్నికల సమయంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవమైన మండాలలకు సంబంధించి ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలివ్వడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. తన పదవీ కాలం మార్చి 31న ముగుస్తున్నందున ఆలోగా ఎన్నికలు పూర్తి చేయాలనినిమ్మగడ్డ భావిస్తున్నందున ఎళాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.