ANDHRA PRADESH SEC NIMMAGADDA RAMESH KUMAR RE SCHEDULED THE PANCHAYAT ELECTIONS PROCESS PRN
AP Panchayat Elections: మరో షాకిచ్చిన నిమ్మగడ్డ... ఏపీలో పంచాయతీ ఎన్నికల రీ షెడ్యూల్
నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికలపై (Panchayat Elections) ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సుప్రీం కోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh kumar) కీలక ఆదేశాలిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలిచ్చారు. పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు. మెదటి దశను నాలుగో దశగా, రెండో దశ ఎన్నికలను మొదటి దశకు మార్చారు. అలాగే మూడో దశను రెండో దశకు మార్చారు. నాలుగో దశను మూడో దశకు మార్చిన ఎస్ఈసీ.. మొదటి దశను నాలుగో దశకు రీషెడ్యూల్ చేశారు. రీ షెడ్యూల్ చేసిన ప్రకారం మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈనెల 29కి వాయిదా వేశారు. నిమ్మగడ్డ రిలీజ్ చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9, 13,17,21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కాకపోవడమే రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. రీషెడ్యూల్ వివరాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు పంపించారు. దీనిపై జిల్లా అధికారులతో కాసేపట్లో సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చిన వెంటనే యాక్షన్ ప్లాన్ లోకి దిగిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తన ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ పై దృష్టి పెట్టిన ఆయన.. సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూశారు. అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించిన వెంటనే రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సిబ్బందికి ఎన్నికల కేటాయింపుకు సమయం ఇవ్వడంతో పాటు అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురుచూసిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను సిబ్బందికి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఉదయం నుంచి ఎన్నికల విధుల్లో అధికారులు పాల్గనకపోవడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇక పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని ఏఫీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భందా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిక్ రిషికేష్ రాయ్ నేతృత్వంలోని బెంచ్ ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాలన్న ధర్మాసనం.., వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అలాగే కేరళలో ఎన్నికల వల్లే కరోనా వ్యాప్తి చెందిందని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. అలాగే ఉద్యోగ సంఘాల వాదనలు వినడానికే ఆసక్తి చూపని కోర్టు.., వారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.