• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH SEC NIMMAGADDA RAMESH KUMAR CANCELS TDP MANIFESTO FOR PANCHAYAT ELECTIONS BA

AP Panchayat elections: టీడీపీకి భారీ షాక్.. పంచాయతీ ఎన్నికలకు ముందు నిమ్మగడ్డ సంచలనం

AP Panchayat elections: టీడీపీకి భారీ షాక్.. పంచాయతీ ఎన్నికలకు ముందు నిమ్మగడ్డ సంచలనం

నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను రద్దు చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను రద్దు చేశారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని, టీడీపీ అధినేత మేనిఫెస్టోను ప్రకటించడం, ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ఈసీ కి ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీడీపీని ఎస్ఈసీ కోరింది. అయితే, టీడీపీ నుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో దాన్ని రద్దు చేస్తూ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెంటనే మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలని, ఎన్నికల సమయంలో దాన్ని ప్రచారం చేయడం కానీ, పంచడం కానీ చేయరాదంటూ టీడీపీకి ఎస్ఈసీ లేఖ రాశారు.

    పంచాయతీ ఎన్నికలకు పంచ సూత్రాలు పేరుతో చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. దీనిపై అధికార వైసీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు రాష్ట్ర ఎస్ఈసీ కి ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

    మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలను ఆపేందుకు కొందరు చేసిన చివరి ప్రయత్నం కూడా అయిపోయిందన్నారు. ఎన్నికలు ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యాయానిదే అంతిమ విజయమన్నారు. తాను బాధ్యతాయుతంగా పనిచేస్తానని, ఏ పార్టీ మీద వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. తాను సాధారణ ఏకగ్రీవాలను తప్పుబట్టడం లేదని, అసాధారణంగా ఏకగ్రీవాలు జరగడం మీద అనుమానాలు వ్యక్తం  చేశానన్నారు. ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యం కిందకు వస్తుందని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అదే సమయంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఉంటాయా? అని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రశ్నించారు. ఏకగ్రీవాల విషయంలో అధికారులు గుడ్డిగా వ్యవహరించొద్దని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ఏదైనా విషయంలో ఫిర్యాదులు వస్తే వాటిని ఆపేస్తామన్నారు. కొందరు ఎలక్షన్స్ వద్దు.. సెలక్షన్స్ కావాలంటున్నారని ఎద్దేవా చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు