• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH SEC NIMMAGADDA RAMEHS KUMAR ISSUES ORDERS TO COLLECTORS OF CHITTOOR AND GUNTUR TO HOLD THE DECLARATION OF UNANIMOUS RESULTS IN GRAMA PANCHAYAT ELECTIUONS PRN

AP Panchayat Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం.. ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలకు బ్రేక్

AP Panchayat Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం.. ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలకు బ్రేక్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) ఏకగ్రీవాలు హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ (Nimmagadda Ramesh Kumar) కుమారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నికల విషయంలో ఎప్పుడూ లేని రగడన నెలకొంది. ముఖ్యంగా ఏకగ్రీవాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీకి షాకిస్తూ ఏకగ్రీవాలకు బ్రేక్ వేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో పెండింగ్ లో పెట్టాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించకూడదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

    అలాగే జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలపై ఎలాంటి ప్రకటన చేయరాదని గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఏకగ్రీవమైన పంచాయతీలపై పూర్తి నివేదికను ఎన్నికల కమిషన్ కు పంపాలన్న ఆయన.. నివేదికలు పరిశీలించిన అనంతరం అవసరమైన చర్యలు తీసకుంటామని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్న ఎస్ఈసీ.. తన పర్యటన విజయవంతమైందని ప్రకటించారు. అలాగే ఎన్నికల సందర్భంగా కొవిడ్ నివారణ చర్యలు పటిష్టంగా ఉన్నాయన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.

    Andhra Pradesh State Election Commission, SEC Nimmagadda Ramesh Kumar, Nimmagadda Ramesh kuamr, Panchayat Elections, AP Panchayat Elections, Andhra Pradesh Panchayat Elections, Panchayat Elections news, Unanimous Elections, Andhra Pradesh news, AP News, Telugu News, , ఆంధ్రప్రదేశ్, పంచాయతీ ఎన్నికలు, ఏపీ పంచాయతీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల వార్తలు, ఓటుకు నోటులు, ఎన్నికల్లో డబ్బుల పంపిణీ, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏకగ్రీవ పంచాయతీలు, గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లా, Guntur District, Chittoor District, Guntur Collector, Chittoor District Collector, గుంటూరు జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్
    ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు బ్రేక్ వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్


    మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవమైననట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని పూతలట్టు నియోజకవర్గంలో 49 గ్రామ పంచాయతీలు, గంగాధర నెల్లూరులో 26, నగరిలో 21, చిత్తూరులో 5, చంద్రగిరిలో 4, సత్యవేడులో 5 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లా విషయానికి వస్తే రేపల్లె నియోజకవర్గంలో 17 గ్రామాలు, బాపట్లలో 15, వేమూరులో 12, పొన్నూరులో 10, తెనాలి 7, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

    పంచాయతీ ఎన్నికల విషయంలో అధికారులపై చర్యలకు తీసుకుంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఏకగ్రీవాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. దీనిపై ఇటీవలై సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కు లేఖ రాశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఏకగ్రీవమైన మండలాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 30 మంది ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు