• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH SEC FOCUSED ON UNANIMOUS GRAMA PANCHAYATS IN KRISHNA DISTRICT ORDERS COLLECTOR TO SUBMIT REPORT ON 5 COMPLAINTS FILED BY LOCALS HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: వైసీపీకి మరో షాకివ్వబోతున్న ఎస్ఈసీ..? కీలక జిల్లా ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ దృష్టి..

AP Panchayat Elections: వైసీపీకి మరో షాకివ్వబోతున్న ఎస్ఈసీ..? కీలక జిల్లా ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ దృష్టి..

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchyat Elections) ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మధ్య వార్ కొనసాగుతోంది. తొలిదశ పోలింగ్ ముందు రోజు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party) షాకిచ్చే పనిలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kuamr) ఉన్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మధ్య వార్ కొనసాగుతోంది. తొలిదశ పోలింగ్ ముందు రోజు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాల ప్రకటనకు బ్రేక్ వేసిన ఆయన.. ఈసారి మరో ముఖ్యమైన జిల్లాపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో కీలకమైన కృష్ణాజిల్లాలో ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కృష్ణాజిల్లాలోని ఏకగ్రీవాలపై ఫిర్యాదులు రావడంతో అప్రమత్తమైన ఎస్ఈసీ అధికారులకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలపై సోమవారం సాయంత్రంలోగా వివారివ్వాలని ఎస్ఈసీ కమిషనర్ కె.కన్నబాబు.. జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

    కృష్ణాజిల్లాలోని మైలవరం, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 4 గ్రామ పంచాయతీల ఏకగ్రీవాలపై నివేదిక ఇవ్వాలని కన్నబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు మండలంలోని వెంకటాపురం, కందులపాడు, మైలవరం మండలంలోని సీతారామపురం తండా, జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామ పంచాయతీలకు సంబంధి మొత్తం ఐదు ఫిర్యాదులు వచ్చినట్లు కన్నబాబు పేర్కొన్నారు. ఈ నాలుగు గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని.. సాయంత్రంలోగా పూర్తి వివగాలు ఇవ్వాలని కన్నబాబు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత కృష్ణాజిల్లాలోని ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

    Andhra Pradesh State Election Commission, SEC Nimmagadda Ramesh Kumar, Nimmagadda Ramesh kuamr, Panchayat Elections, AP Panchayat Elections, Andhra Pradesh Panchayat Elections, Panchayat Elections news, Unanimous Elections, Andhra Pradesh news, AP News, Telugu News, , ఆంధ్రప్రదేశ్, పంచాయతీ ఎన్నికలు, ఏపీ పంచాయతీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల వార్తలు, ఓటుకు నోటులు, ఎన్నికల్లో డబ్బుల పంపిణీ, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏకగ్రీవ పంచాయతీలు, గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లా, Guntur District, Chittoor District, Guntur Collector, Chittoor District Collector, గుంటూరు జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్, కృష్ణాజిల్లా, Krishna Disctrict, Krishna District Collector, కృష్ణాజిల్లా కలెక్టర్, K. Kannababu IAS
    రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.కన్నబాబు జారీ చేసిన ఆదేశాలు


    బలవంతపు ఏకగ్రీవాల విషయంలో సీరియస్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే చిత్తూరు, గుంటూరు జిల్లాలోని ఏకగ్రీవాలకు బ్రేక్ వేశారు. కృష్ణాజిల్లాలో 234 పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలు జరగనుండగా వాటిలో 22 పంచాయతీల్లో ఎకగ్రీవైంది. అటు చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవమైననట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని పూతలట్టు నియోజకవర్గంలో 49 గ్రామ పంచాయతీలు, గంగాధర నెల్లూరులో 26, నగరిలో 21, చిత్తూరులో 5, చంద్రగిరిలో 4, సత్యవేడులో 5 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లా విషయానికి వస్తే రేపల్లె నియోజకవర్గంలో 17 గ్రామాలు, బాపట్లలో 15, వేమూరులో 12, పొన్నూరులో 10, తెనాలి 7, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల నిబంధనల విషయంలో కాస్త దూకుడుగా ఉన్న ఎస్ఈసీ.. తాజా పరిణామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు