పోలీస్ స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి హల్‌చల్

పోలీస్ స్టేషన్‌లో కూర్చున్న జేసీ దివాకర్ రెడ్డి కొద్దిసేపు కోపంతో ఊగిపోయారు. వైసీపీ నేతల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: April 11, 2019, 5:38 PM IST
పోలీస్ స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి హల్‌చల్
జేసీ దివాకర్‌రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 11, 2019, 5:38 PM IST
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల సందర్భంగా హల్ చల్ చేశారు. అనంతపురం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో హంగామా చేశారు. ఎన్నికల సందర్భంగా ఎల్లనూరులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీంతో ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు కొందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వైసీపీ నాయకుడు జోగాది వినోద్ కుమార్ కూడా అక్కడకు వచ్చారు. పోలీస్ స్టేషన్‌లో కూర్చున్న జేసీ దివాకర్ రెడ్డి కొద్దిసేపు కోపంతో ఊగిపోయారు. వైసీపీ నేతల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారికి సర్దిచెప్పడానికి పోలీసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...