ఏపీలో 80 శాతం పోలింగ్ ? రీపోలింగ్‌పై రేపు నిర్ణయమన్న ద్వివేది .

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది (ఫైల్ ఫోటో)

ఎక్కడైనా రిపోలింగ్ అవసరమా లేదా అనేది రేపు నిర్ణయిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేశారు. పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై రిటర్నింగ్ అధికారి నుంచి నివేదిక తీసుకుంటామని... వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని వెల్లడించారు.

  • Share this:
    ఏపీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందన్న ఆయన... రీ పోలింగ్‌పై రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఎక్కడైనా రిపోలింగ్ అవసరమా లేదా అనేది రేపు నిర్ణయిస్తామని ద్వివేది స్పష్టం చేశారు. పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై రిటర్నింగ్ అధికారి నుంచి నివేదిక తీసుకుంటామని... వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని వెల్లడించారు. రీ పోలింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘమే తుది నిర్ణయం తీసుకుంటుందని ద్వివేది తేల్చిచెప్పారు.

    ఏపీలో సాయంత్రం ఐదు గంటల వరకు 60.57 శాతం పోలింగ్ జరిగిందని ద్వివేది తెలిపారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలపై 7 కేసులు నమోదుయ్యాయని అన్నారు. ఘర్షణలు జరిగిన చోటపోలైన ఓట్లు, సీసీటీవీ దృశ్యాల పరిశీలిస్తామని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ద్వివేది తెలిపారు. సమయం ముగిసిన తరువాత క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
    First published: