హోమ్ /వార్తలు /politics /

YCP Vs Pawan Kalyan: సినీ పరిశ్రమకు పవన్ పెద్ద గుదిబండ.. ఆయన్ను పెద్దలు పక్కన పెట్టారన్న సజ్జల

YCP Vs Pawan Kalyan: సినీ పరిశ్రమకు పవన్ పెద్ద గుదిబండ.. ఆయన్ను పెద్దలు పక్కన పెట్టారన్న సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి(ఫైల్ ఫొటో)

సజ్జల రామకృష్ణారెడ్డి(ఫైల్ ఫొటో)

Ycp On Pawan Kalyan: ఏపీ రాజకీయాలు ఇప్పుడు పవన్ వర్సెస్ వైసీపీగా మారాయి. మొన్నటి వరకు టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న రాజకీయం.. మరో టర్న్ తీసుకుంది. ఇటీవల రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం తీరుపై పవన్ నిప్పులు చెరిగారు. అప్పటి నుంచి హీట్ కంటిన్యూ అవుతోంది. మీరు ఒక మాంటంటే.. మేం రెండు అంటాం అంటూ ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. రాజకీయ విమర్శలు ఇప్పుడు వ్యక్తిగత టార్గెట్ ల వరకు వెళ్లింది..

ఇంకా చదవండి ...

Sajjala Ramkrishna Reddy On Pawan Kalyana: ఆంధ్రప్రదేశ్ రాజకీయ (Andhra Pradesh Politics) వాతావరణం హీటెక్కింది. ఎన్నికల ఫీవర్ ను తలపిస్తోంది. ముఖ్యంగా నసేన-వైఎస్ఆర్సీపీ (Janasena-YSRCP) మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. టీడీపీ-వైసీపీ (TDP_YCP)కి మించి జనసేన-వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో (Republic Move pre-Release Event)జనసేనాని పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government)పై చేసిన వ్యాఖ్యలు ఇటు రాజీయాల్లో, అటుటాలీవుడ్ (Tollywood) లో ప్రకంపనలు రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలకు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. నేరుగా పవన్ ను టార్గెట్ చేస్తూ మాటల దాడి పెంచారు. అదే స్థాయిలో పవన్ సైతం ట్విట్టర్ వేదికగా సమాధానం ఇస్తున్నారు. పనన్ సినిమాలను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఏపీ మంత్రులు పేర్నీ నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యన్నారయణ లు ఘాటు వ్యాఖ్యలే చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

తాజాగా బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30న పోలింగ్.. నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలో పోటీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యలకు కంటౌర్ ఇచ్చారు. పవన్ ఇండస్ట్రీకి పెద్ద గుదిబండ అని సినీ పెద్దలు భావిస్తున్నారన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను ఇండస్ట్రీలో అందరూ కోరుకుంటున్నారు. ఈ వ్యవస్థని ప్రొడ్యూసర్లు, డిస్టిబ్యూటర్లు ప్రధానంగా కోరుతున్నారన్నారు.

ఇదీ చదవండి: కోనసీమవాసుల్లో టెన్షన్ టెన్షెన్.. ప్రమాదం పొంచి ఉందా..? తూనీగలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి..?

వినోదం పేరుతో దోపిడీ లేకుండా తక్కువ ఖర్చుతో ప్రజలకు అందాలనేదే మా విధానం. ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలతో అందరికీ మంచి జరుగుతుందన్నారు. కచ్చితంగా ఈ నిర్ణయంపై ముందుకు వెళ్తాం. సినీ పెద్దలు అంగీకరించారు. ఏవిధంగా తీసుకురావాలని అనే దానిపై టెక్నికల్ గా ప్రాసెస్ నడుస్తుంది. త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. సినీ పెద్దలు సీఎం జగన్ తో మాట్లాడలంటే ఎప్పుడైనా రావొచ్చు. సీఎం జగన్ అందరినీ కలుస్తున్నారు.. అలానే సినిమా వాళ్ళు వస్తే వాళ్ళని కలుస్తారు.. సమస్యలు ఉంటే వింటారు.. పరిష్కరిస్తారని సజ్జలు అన్నారు.

ఇదీ చదవండి: దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రెచ్చిపోతున్న పోకిరీలు.. ర్యాష్ డ్రైవింగ్.. తుపాకీ స్టంట్లతో అలజడి

బద్వేల్ అభ్యర్థిగా సుబ్బయ్య భార్య సుధని సీఎం జగన్ ఎంపిక చేశారనీ.. చనిపోయిన వారి కుటుంబానికే తాము మొదటి ఛాన్స్ ఇచ్చామని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. చనిపోయిన వారి కుటుంబానికి ఎన్నిక లేకుండా ఇవ్వడం ఆనవాయితీ. ప్రతిపక్షాలు పోటీ పెడతాయా లేదా మిగతా పార్టీల ఇష్టం. పోటీ పెట్టకపోతే సంతోషం. పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఫలితాల్లో గతంలో కంటే మాకు మంచి మెజార్టీ వస్తుంది. మూడు నాలుగు రోజుల్లో నేతలతో సీఎం చర్చించి కార్యాచరణ రూపొందిస్తారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా చూస్తాం. రిఫరెండం అని ఏమీ అనుకోవడం లేదు.. ప్రజల మద్దతు మాకు ఉంటుంది అని ఆయన ధీమా వ్యక్తంచేశారు.s

First published:

Tags: Andhra Pradesh, Ap government, Janasena, Pawan kalyan, Sajjala ramakrishna reddy, Ycp

ఉత్తమ కథలు