ANDHRA PRADESH POLITICS HEAT BETWEEN YCP AND JANASENA NOW TWEETS WAR BETWEEN PAWAN AND YCP NGS
Pawan Kalyan: వైసీపీ మంత్రులు ఒకవైపు.. పవన్ ఒక వైపు.. వరుస ట్వీట్లతో దూకుడు పెంచిన జనసేనాని..
Pawan Kalyan Photo : Twitter
Pawan Vs Ycp: ఏపీ ప్రభుత్వానికి- జనసేన అధినేత పవన్ కు మధ్య వార్ పీక్ కు చేరింది. ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. నువ్వు రెండంటే.. నేను నాలుగు అంటాను అంటూ కౌంటర్లు.. రివర్స్ కౌంటర్లు వేసుకుంటున్నారు. గత రెండు రోజుల నుంచి రాజీకయ దూమారం రేపుతు ఈ యుద్ధంలో పవన్ మరో ట్వీట్ తో మంత్రుల వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు..
Andhra Pradesh Government vs Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయ (Andhra Pradesh Politics) జనసేన వర్సెస్ వైసీపీ(Jana sena vs Ycp)గా మారాయి. మొన్నటి వరకు టీడీపీ Vs వైసీపీ (Tdp Vs YCP)గా ఉన్న రాజకీయం.. మరో టర్న్ తీసుకుంది. ఇటీవల రిపబ్లిక్ సినిమాప్రీ రిలీజ్ ఈవెంట్ (Republic movie pre release) లో ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government)తీరుపై పవన్ నిప్పులు చెరిగారు. అప్పటి నుంచి హీట్ కంటిన్యూ అవుతోంది. రెండు రోజుల క్రితం మొదలపై రాజకీయ దుమారం ఇప్పటికే ఆగడం లేదు ఇంకాస్త పీక్ కు చేరుతోంది. రిపబ్లిక్ సినిమా ప్రీ ఈవెంట్ రిలీజ్ కు ముఖ్య అతిథిగా హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)... సినిమా ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురించేస్తుందని విమర్శించారు. అంతే కాకుండా ఏపీ మంత్రులపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక పవన్ వ్యాఖ్యలను తప్పు పడుతూ పలువురు మంత్రులు.. మండిపడుతున్నారు. వారికి తోడు పోసాని సైతం ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారికి ట్వీట్స్ ద్వారా కౌంటర్లు వేస్తున్నారు.
ఆయన మరో ట్వీట్ చేశారు.వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’కి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది” అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. http://
వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..
అలాగే ‘ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి.. హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? అంటూ ట్వీట్ లో విరుచుకుపడ్డారు పవన్. http://
ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? pic.twitter.com/cbfX4hI7bK
పవన్ ఎపిసోడ్‌పై వైసీపీ మంత్రులు ఒంటికాలిపై లేచారు. పవన్ సినిమాటిక్ డైలాగ్స్‌కు పొలిటికల్ పవర్ పంచ్‌లతో కౌంటర్లు వేశారు. ముఖ్యంగా పేర్ని నాని ఇంచ్ టూ ఇంచ్ పంచ్ టూ పంచ్ హైవోల్టేజ్ సమాధానాలు ఇచ్చారు. ఇది ఒక పార్ట్. తర్వాత ఇదే ఎపిసోడ్‌లోకి పోసాని ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే మూవీ మరో రేంజ్‌కు వెళ్లింది. తనదైన శైలిలో పవన్‌పై విరుచుకుపడ్డారు పోసాని. వ్యక్తిగత విషయాలు మొదలు పెట్టి పొలిటికల్ ఇష్యూస్ వరకూ చాలా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ ఇలా వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.. వైసీపీ గ్రామసింహాలు అంటూ సెటైర్లు పేల్చారు.. అటు నుంచి కూడా అదే రేంజ్లో ట్వీట్లు. కాసేపు సీన్ ట్విట్టర్‌కు షిఫ్ట్ అయింది. ఆ తర్వాత సీన్లోకి పవన్ ఫ్యాన్స్ వచ్చారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.