Home /News /politics /

ANDHRA PRADESH POLITICAL NEWS YCP TDP LEADERS READY TO MEET ONE PLATFORM IN NELLORE NGS

YCP-TDP: కలవరు అనుకున్న వైసీపీ-టీడీపీ నేతలను కలుపుతున్న కొత్త జిల్లాలు.. పార్టీ మారాలని ఆయన ఫిక్స్ అయ్యారా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

YCP-TDP: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు.. అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలు జిల్లాల వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆందోళనలు చేశారు.. నేరుగా సీఎంపై విమర్శలు చేశారు. ఓ నేత అయితే తన చెప్పుతో చెంప పగలగొట్టుకున్నాడు. కొందరు నేరుగా సీఎంను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పుడు ఓ వైసీపీ కీలక నేత.. మరో టీడీపీ నేత కలుస్తుండడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఇంకా చదవండి ...
    YCP-TDP: వాళ్లిద్దరివి వేర్వేరు పార్టీలు.. వేరు వేరు విధానాలు.. మధ్యలో కొన్ని రోజులు ఒకే పార్టీలో ఉన్నా..? ఎక్కువ కాలం ప్రత్యర్థులుగానే ఉన్నారు. ఇద్దరు ఆ జిల్లాలో సీనియర్ నేతలు.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు.. మంత్రులుగా చేసిన అనుభవం కూడా ఉంది. అలాంటి నేతలు ఇప్పుడు మాట-బాట కలుపుతున్నారు. ఇది అంతవరకే పరిమితం అవుతుందా? అంతకుమించి ఇంకేమైనా ఉందా అనేది ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వారెవరో కాదు.. టీడీపీలో కీలక నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి. వైసీపీలో సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. వీరిద్దరు వేర్వేరు పార్టీలో ఉన్నా.. ఇద్దరి మధ్య ఎప్పుడూ పెద్దగా శత్రుత్వం లేదు. రాజకీయ విమర్శలు తప్ప. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి లేకున్నా.. కాకపోతే వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు సహజంగా చేసుకునే విమర్శలతో ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ ఉంది. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నా.. ఆ పార్టీ నుంచి ఆనం బయటకు వెళ్లిపోవడానికి దారితీసిన కారణాల్లో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సోమిరెడ్డి కూడా ఒకర అనే ప్రచారం మాత్రం ఉంది. అయితే ఆనం పార్టీ మారినప్పటి నుంచి వీరిద్దరి మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవు.. వేర్వేరు శిబిరాల్లో ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియతో మళ్లీ కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది.

    పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన చేపడుతోంది ప్రఝభుత్వం.. ఇప్పటికే ప్రాంతాల వారిగా అభ్యంతరాలు, సూచనల గడువు కూడా ముగిసింది.. అయితే ఈ కొత్త జిల్లాల విషయంలో.. అధికారపార్టీలో చాలామంది నేతలు అసంతృప్తి రాగం వినిపించారు. ఇంకా వినిపిస్తూనే ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు ఉన్నా ఎవరూ నోరు మెదపడం లేదు. హైకమాండ్‌కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. అయితే కొందరు సీనియర్ నేతలు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారని టాక్.. ఇటీవల ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై.. ఆనం తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ప్రజలతోకానీ.. ప్రజాప్రతినిధులతో కానీ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా నెల్లూరు జిల్లా విభజన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అడ్డదిడ్డంగా జిల్లాల విభజన చేస్తే అంతిమంగా అది ప్రాంతాల మధ్య నీటి కొట్లాట్లకు దారి తీస్తుందని స్థానికంగా ఉన్న పరిస్థితులను ఆయన వివరించారు.

    అయితే ఆనం మాట్లాడిన లైన్ లోనే.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి కూడా స్పందించారు. సోమిరెడ్డి కామెంట్స్‌ తర్వాత రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. చర్చకు దారితీయడానికి కారణాలు లేకపోలేదు. కొంత కాలంగా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలను ఆనం ఏదోక సందర్భంలో.. ఏదోక వేదిక మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా జిల్లాల విభజన జరుగుతున్న తీరును తప్పుపట్టారు ఆనం. జిల్లాల విభజన అనే కాకుండా.. కేవలం కొత్త జిల్లాల అంశం మాత్రమే కాదు.. చాలా అంశాల్లో కూడా ఆనం అసంతృప్తితోనే ఉన్నట్టు ప్రచారం ఉంది. ఆయన కామెంట్స్‌కు సపోర్ట్‌గా సోమిరెడ్డి నిలవడంతో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.

    ఇదీ చదవండి : మరోసారి పెద్దమనసు చూపించిన పవన్.. బీమా లేకపోయినా 5 లక్షల సాయం చేసిన భీమ్లా నాయక్

    తాజాగా జిల్లాల విభజన ప్రక్రియలో స్థానికంగా ఉన్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్లాలని.. స్థానికంగా ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ అధినాయకత్వం సూచించింది. రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లె వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాల్లో లోకల్‌ టీడీపీ నేతలు యాక్టివ్‌గానే పార్టిసిపేట్‌ చేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా విభజనపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్త గళం వినిపించడం.. దానినే అజెండాగా తీసుకోవాలని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశం మీద ఆనంతో సోమిరెడ్డి భేటీ కానున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే కనుక జరిగితే.. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగడం ఖాయం.

    ఇదీ చదవండి : కన్న కూతురి కంటే గొప్పగా పెంపుడు కుక్కకు సీమంతం.. ఆశ్చర్యపరిచిన ఆహారపదార్దాలు.. ఆహ్వాన పత్రికలు

    ఆనం-సోమిరెడ్డి భేటీతో కీలక పరిణామాలకు ఆస్కారం..!
    ఆనం-సోమిరెడ్డి మధ్య భేటీ జరిగితే అది కేవలం జిల్లా విభజనకే పరిమితం కాకుండా.. ఇతరాత్ర పరిణామాలు.. మిగిలిన అంశాల జోలికి కూడా వెళ్లొచ్చనేది టీడీపీలో చర్చ జరుగుతోంది. ఆ తరహా ప్లానింగ్‌తోనే జిల్లా విభజనపై ఆనం అభ్యంతరం వ్యక్తం చేయడం.. ఆనం చెప్పింది కరెక్టేనని సోమిరెడ్డి రియాక్ట్‌ అయ్యారని అనుకుంటున్నారట. మరి.. వీరిద్దరి భేటీ జరుగుతుందో లేదో చూడాలి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Anam Ramanarayana Reddy, Andhra Pradesh, AP News, Somireddy chandramohan reddy, TDP, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు