YCP vs TDP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) హస్తినలో హీటుపుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు మాటల తూటాలతో రాష్ట్రంలో రాజీకయంగా రచ్చ రచ్చ అయ్యింది. ప్రస్తుతం ఇక్కడ వేడి చల్లారినా.. హస్తినలో మాత్రం సెగలు రేపుతూనే ఉంది. ప్రభుత్వంపై రాష్ట్రపతికి చంద్రబాబు (Chandra Babu) ఫిర్యాదు చేస్తే, ఇప్పుడు ఈసీకి టీడీపీ (TDP)పై కంప్లైంట్ ఇచ్చారు వైసీపీ ఎంపీలు (YCP MPs). తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. మరోవైపు అమిత్‌షా (Amit Shah) కు పోటీపడి మరీ ఫిర్యాదు చేశారు రెండు పార్టీల ఎంపీలు. ముందు చెప్పినట్టుగానే టీడీపీ గుర్తింపు రద్దుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు వైసీపీ ఎంపీలు. రాష్ట్రంలో పరిణామాలను, టీడీపీ నేతల తీరును ఎన్నికల కమిషనర్లకు వివరించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం జగన్ (CM Jagan)పై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయ అలజడి సృష్టించాలని కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. లోకేష్ (Lokesh), పట్టాభి (Phattabhi), దేవినేని ఉమ (Devineni Uma), బోండా ఉమ (Bonda Uma), అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy).
ఈ రాజకీయ రణరంగం నేపథ్యంలో ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పోటాపోటీగా మంతనాలు జరిపారు వైసీపీ, టీడీపీ ఎంపీలు. పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశం సందర్భంగా లాబీల్లో ఈ సీన్ కనిపించింది. ఒకవైపు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, మరోవైపు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అమిత్‌షాతో మాట్లాడేందుకు పోటీ పడ్డారు. గోరంట్ల మాధవ్ లేఖ ఇచ్చి మరీ చంద్రబాబు, టీడీపీ తీరుపై అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు కుట్రలను అడ్డుకోవాలని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు మాధవ్.
ఇదీ చదవండి: టీడీపీ-బీజేపీ పొత్తుపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ఫైనల్ చేసేది వారే అంటూ క్లారిటీ
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో నేర్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును ప్రజలు తిరస్కరించినా ఇంకా అధికారం చలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై బోధించే పాఠశాలను కేంద్ర హోంశాఖ నెలకొల్పి దాంట్లో చంద్రబాబుకు విద్యాబోధన చేయాలని అమిత్‌షాను కోరానన్నారు. అసభ్య పదజాలంతో ధూషణలు చేయిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టాలని బాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు స్కూల్ ఆఫ్ అఫెన్సివ్ లాంగ్వేజ్ ప్రమోషన్ ఈ పనిలోనే ఉందన్నారు. టీడీపీ నేత పట్టాభి ఉపయోగించిన భాష మైనర్లను ప్రభావితం చేసేలా ఉన్నందున పోక్సో చట్టం కింద విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనుకున్నారు.. మరణంలోనూ ఒక్కటయ్యారు.. ఉద్యోగమే అసలు కారణమా
ఇటు ఏనీ కేబినెట్ భేటీలో టీడీపీ అంశంపై జోకులు పేలాయి. సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ కేబినెట్ భేటీలో టీడీపీ గురించి ఛలోక్తులు విసిరారు. మావోయిస్టులపై నిషేధాన్ని పొడిగించే అంశంపై చర్చ సందర్భంగా.. టీడీపీ పేరును కూడా ప్రస్తావించారు బొత్స సత్యనారాయణ. పనిలో పనిగా టీడీపీ పైనా నిషేధం పెట్టేయండి అంటూ బొత్స్య కామెంట్స్ చేశారు. దాంతో మంత్రివర్గ సభ్యులంతా నవ్వుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, TDP, Vijayasai reddy, Ycp