ANDHRA PRADESH POLITICAL NEWS WHY RAJAMUNDRY MUNICIPAL ELECTIONS WAS NOT DONE ANY POLITICAL REASON NGS VSP
AP Politics: ఆ ఒక్క కార్పొరేషన్ పరిస్థితి ఏంటి..? ఎన్నికలు ఎందుకు జరగడం లేదు?
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్
AP Politics: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలతో రాజకీయ వాతావరణ వేడెక్కింది. ఇప్పటికే చాలా చోట్ల ఎన్నికలు జరిగిపోయాయి.. మిగిలిన వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఆ ఒక్క కార్పొరేషన్ మాత్రం ఎన్నికలకు నోచుకోవడం లేదు.. కారణం ఏంటి..?
P. Anand Mohan, Visakhapatnam, News18, AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)వ్యాప్తంగా చాలా కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి అయ్యాయి.. మిగిలిన వాటికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) విషయానికి వస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections), జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు ఇటీవలే ప్రకటిం చారు. ఈలోపు కొంతమంది అభ్యర్థులు మృతి చెందారు. కొందరు ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్‌లుగా ఎన్నిక కావ డంతో ముందు పదవికి రాజీనామా చేశారు. పలువురు వార్డు సభ్యులు కూడా రకరకాల కారణాలతో రాజీనా మాలు చేయడం, మృతి చెందడం వంటి కారణాలతో వాటికీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కానీ రాజమహేంద్రవరం (Rajamundry) మున్సిపల్ కార్పొరేషన్‌కు మాత్రం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యేకాధికార్ల పాలనలోనే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చాలాకాలం నుంచి ఉంది. గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా కొన్ని గ్రామాల విలీన ప్రక్రియ కారణంగా జరగలేదు. మొదట్లో రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కడియం మం డలాల పరిధిలోని 21 గ్రామాలను విలీనం చేయడంతో పాటు 54 డివిజన్లుగా విభజించారు.
తర్వాత కోర్టు వివాదాల కారణంగా కేవలం రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని 10 గ్రామాలను మాత్రమే విలీనం చేస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ జారీచేశారు. దీంతో 52 డివిజన్లతో వార్డులు విభజించారు. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు.
కోర్టు మరో నెలరోజులపాటు వాయిదా వేసింది. ఈలోపు ఈ పది గ్రామాల చెక్‌బుక్‌లు, మినిట్స్ బుక్స్‌ను మున్సిపల్ కమిషనర్ స్వాధీనం చేసుకున్నారు. అవి కార్పొరేషన్‌లో కలిసిపోయినట్టు చూపారు. కానీ విద్యుత్, మంచినీటి సౌకర్యాలు, రోడ్లు, పారిశుధ్యం వంటి పనుల్లో పెద్దగా మార్పులేదు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే అధికారికంగా విలీనమైనట్టు భావించాలి.
జిల్లాలో 31 పంచాయతీలకు చాలాకాలం నుంచి ఎన్నికలు జరగడం లేదు. అందులో రాజమహేంద్రవరంలో 10 గ్రామాలు కలిసిపోయే పరిస్థితి ఉన్నా మిగతా వాటికి ఎన్నికలు ఎందుకు జరపడం లేదనేది ప్రశ్నగా మారింది. కాకినాడ రూరల్ మండలం పరిధిలోని చీడిగ, ఇంద్రపాలెం, రమణయ్యపేట, తూరంగి, వాకలపూడి, వలసపాకల, తుని మండలంలోని కుమ్మరిలోవ, రేఖావాని పాలెం, ఎస్.అన్నవరం, తాళ్లూరు గ్రామ పంచాయ తీలు ఉన్నాయి.
ఇక కోరుకొండ మండలం పరిధిలోని బూరు గుపూడి, గాడాల, మధురపూడి, నిడినిట్ల, రాజానగరం మండ లంలోని చక్రద్వారబంధం, దివాన్‌చెరువు, లాలాచెరువు, నామవరం, పాలచర్ల, వెలుగుబంద గ్రామాలు రాజమహేంద్ర వరం కార్పొరేషన్‌లో విలీనం కాలేదు. కానీ వీటికి ఇప్పటి వరకూ ఎన్నికల ప్రస్తావన లేదు.
రాజమహేంద్రవరం రూరల్‌లోని రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని ధవళేశ్వరం, బొమ్మూరు, రాజవోలు, హుకుంపేట, పిడింగొయ్య, కాతేరు, తొర్రేడు. వెంకటనరం, శాటిలైట్‌సిటీ గ్రామ పంచా యతీలను విలీనం చేస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసినా ఇప్పటివరకూ విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. రికార్డులు మాత్రం కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్కడ ఇంకా ప్రత్యేకాధికారులే ఉన్నారు. సెక్రటరీలు ఉన్నారు. కాని రాజమహేంద్రవరం రూరల్ మండలంలో పరిధిలోని కోలమూరును మాత్రం గవర్నర్ ఆర్డినెన్స్‌లో ప్రకటించలేదు. దీంతోపాటు, లాలాచెరువును కూడా రాజమహేంద్రవరంలో విలీనం చేయాలనే వాదన ఉంది. ఈ రెండూ కలసిపోయినా.. మిగతా వాటికి ఎన్నికలు జరపవలసి ఉంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.