ANDHRA PRADESH POLITICAL NEWS TENSION SITUATION AT MUNICIPAL ELECTIONS IN KUPPAM AND OTHER DISTRICTS NGS
AP Municipal Fight: కుప్పంలో యుద్ధ వాతావరణం.. విశాఖలో పోటాపోటీ దాడులు.. ఫిర్యాదులతో ముగిసిన పోలింగ్
కుప్పంలో ఉద్రిక్తత
AP Municipal Fight: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. అడుగడున అక్రమాలు అంటూ ఆరోపణలు మిన్నంటాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం కనిపించింది. కుప్పంలో అయితే యుద్ధ వాతావరణమే కనిపించింది. కొన్ని చోట్ల పోటా పోడీ దాడులతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిసింది.
AP Municipal Fight: ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) లో కేవలం మిగిలిన స్థానాలకు మున్సిపల్ పోలింగ్ (Municipal Poling) జరిగింది. అవి కూడా సాధారణ ఎన్నికలను తలపించాయి. అధికార విపక్షాలు పోటా పోటీగా ఢీ కొట్టాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu naidu)సొంత నియోజకవర్గం కుప్పంలో మున్సిపల్ ఎన్నికలు యుద్ధాన్ని తలపించాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటూ నిలదీసిన టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్‌లో టీడీపీ శ్రేణులకు తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా ఉంది. అయితే టీడీపీ నేతలే ఓటు వేయనందుకు దాడులు చేశారంటూ వైసీపీ (YCP) నేతలు ఆరోపించారు. మరోవైపు భారీగా దొంగ ఓట్లు పడినట్టు తెలుస్తోంది. కొంతమందిని టీడీపీ నేతలు అడ్డుకుని పోలీసులకు అప్పచెప్పారు..
ఇక కడప జిల్లాలోని కమలాపురంలో ను ఉద్రిక్త వాతావరణం కనిపించింది. టీడీపీ నేతలు చైతన్యరెడ్డి, లక్ష్మిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ బూతుల దగ్గర స్వేచ్చగా తిరుగుతున్నవైసీసీ నేతలు తిరుగుతున్న పోలీసులు అడ్డుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు 45 డివిజన్ ఎన్నికల్లో అధికార పార్టీ భారీగా డబ్బులు పంపిణీ చేస్తోందని విపక్షాలు ఆరోపించాయి. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే డబ్బులు పంపిణీ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందాయి.
విశాఖపట్నంలోనూ పోటా పోటీ దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 31వ వార్డు ప్రేమసమాజం పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ కండువాలతో కార్యకర్తలు వచ్చారు. వైసీపీ నేతలను జనసేన కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. జనసేన కార్యకర్తలే వైసీపీ ఓటర్లను అడ్డుకున్నారంటూ అధికార పార్టీ ఆరోపిస్తోంది. దాదాపు ఎన్నికలు జరిగిన అన్ని చోట్ల అదే పరిస్థితి కనిపించింది.
ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో వైసీపీ నేతలు ఖూనీ చేశారని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఎన్నికల ను అపహాస్యం చేయడం చరిత్రలో చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను నిర్బంధించి, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు. పోలీసులు సైతం దొంగలకు వంత పాడుతున్నారన్నారని విమర్శించారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని కుప్పం ఎలా రానిచ్చారని ప్రశ్నించారు.
వైసీపీ నేత సజ్జల టీడీపీ నేతల ఆరోపణలపై మండిపడ్డారు. ఇంతకాలం చంద్రబాబు చేతిలో మగ్గిపోయిన కుప్పం ప్రజలు స్వచ్చందంగా ఓట్లు వేయడానికి వచ్చారన్నారు. స్థానిక ఎన్నికల్లో మొదటిసారి కుప్పం కోట బద్దలైందన్నారు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమం ద్వారా అభివృద్ధిని ప్రజలంతా చూస్తున్నారని.. స్థానిక ఫలితాలే కుప్పం టౌన్లో రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నారు. కుప్పంలో అక్రమాలకు పాల్పడిందే టీడీపీనే అని సజ్జల ఫైర్ అయ్యారు..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.