ANDHRA PRADESH POLITICAL NEWS TDP CHIEF CHANDRABABU NAIDU CHANGE HIS STYLE IS IT PERMANENT AND TEMPORARY NGS
Chandra Babu: చంద్రబాబు స్టైల్ మార్చారా..? అధికారం లేకపోవడంతో తీరు మారిందా.. జోష్ లో తెలుగు తమ్ముళ్లు
చంద్రబాబు (ఫైల్ ఫోటో)
Chandra Babu: చంద్రబాబు నాయుడు స్టైల్ మార్చారా..? గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు తమ్ముళ్లతో ప్రవర్తిస్తున్నారా..? ఈ మార్పనకు కారణం ఏంటి..? తమ అధినేత మొదటి నుంచి ఇలానే ఉంటే ఫలితం వేరేలా ఉండేంది అంటున్నారు. ఇంతకీ చంద్రబాబులో వచ్చిన మార్పు ఏంటి.
TDP Chief Change his style: టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) ను పోసాని మీరు మారిపోయార్ సార్ అన్నట్టు.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ని తెలుగు తమ్ముళ్లు మీరు మారిపోయారు సార్ అంటున్నారు. అయితే ఈ మార్పు ఫుల్ టైమా లేక, టెంపరరీనా అని అనుమాన పడుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు తమను అస్సలు పట్టించుకోని అధినేత.. అధికారానికి దూరమైన సమయంలో వచ్చిన మార్పు నమ్మశక్యంగా లేదనుకుంటున్నారట.ఇదే తీరు గతంలో కూడా ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అనుకుంటున్నారని టాక్. అధికారంలో ఉండగా దర్శన భాగ్యమే కరువయ్యేది. అలాంటిది తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్-ఇన్ కార్యక్రమాలు చేపడుతున్నారంట.. అంతేకాదు ప్రతి రెండు రోజులకోసారి క్షేత్ర స్థాయిలో ఉండే సామాన్య కార్యకర్తలతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ప్రత్యేక పరిస్థితులు ఉంటే.. రోజుకు ఇద్దరు ముగ్గురితో స్వయంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటుటన్నారు. ఇలా అధినేతలో వచ్చిన మార్పు చాలా మంచిదే అంటున్నారు. ఈ మార్పు తాత్కాలికం కాకుండా.. శాశ్వతంగా ఉంటుందా..? అని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా.. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మరోలా ఉండడమనేది రాజకీయ పార్టీల నేతలకు.. సర్వసాధారణమే.. ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ.. ఆయా నేతల గురించి.. ఆ పార్టీల అధినాయకుల గురించి చర్చించుకుంటూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీలో అయితే ఇది రోటీన్ వ్యవహరంగా కన్పిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా కార్యకర్తలతో వ్యవహరించడం తెలుగుదేశాధినేత చంద్రబాబుకు అలవాటే. ప్రస్తుతం షరా మామూలుగానే తన పంథాను మార్చారు చంద్రబాబు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబులో తేడా బాగా కన్పిస్తోందట. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు.. పార్టీ నేతలు గురించి పదే పదే ప్రస్తావించేవారని.. వాళ్లకి రెగ్యులర్‌గా అప్పాయింట్మెంట్లు ఇచ్చేవారని.. కానీ ఇప్పుడు ఆ స్టైల్ మార్చేసి, మరింత దగ్గరయ్యేలా బాబు వ్యవహరిస్తున్నారనది తెలుగు తమ్ముళ్ల మాట.
ప్రస్తుత ప్రతిపక్ష పాత్రలో కార్యకర్తలతో.. క్షేత్ర స్థాయిలో పని చేసే నేతలతో చంద్రబాబు నేరుగా టచ్‌లోకి వెళ్లిపోతున్నారట. ఏదైనా ఇబ్బంది క్షేత్ర స్థాయిలో ఓ కార్యకర్తకు వస్తే వెంటనే సదరు కార్యకర్తకు ఫోన్ చేసి మాట్లాడేస్తున్నారట. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాచవరంలో ఓ మహిళా కార్యకర్తకు నామినేషన్ వేసే విషయంలో ఇబ్బంది ఎదురైతే ప్రెస్ మీట్ నుంచే నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే కుప్పంలో దాడికి గురైన రమేష్ అనే కార్యకర్తకు అదే విధంగా ఫోన్ చేసి పరామర్శించారు.
ఇదేదో స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన వ్యవహరం కాదట.. చంద్రబాబు రెగ్యులర్‌గానే ఈ తరహాలో నేరుగా కార్యకర్తలకు టచ్‌లోకి వెళ్తున్నారట. చంద్రబాబు ఈ తరహాలో నేరుగా కార్యకర్తలతో టచ్‌లోకి వెళ్లడంతో పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదేదో అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా అంటున్నాయి పార్టీ వర్గాలు. అధికారంలోకి ఉన్నప్పుడు టచ్‌మీ నాట్ అన్నట్టు ఉండడం దేనికి..? అధికారం కొల్పోయాక.. కీప్ ఇన్ టచ్ అంటూ ఫోన్లు చేయడం దేనికంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతా చేస్తున్నా.. పార్టీ కార్యకర్తల్లో మాత్రం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టే ఎక్కడా లేని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చూపిస్తూ…. నేరుగా ఫోన్లు చేస్తున్నారని.. పార్టీ అధికారంలోకి వస్తే మాతో ఈ విధంగా ఉండగలరా అనేది అనుమానమేనని అంటున్నారట. అవసరం వచ్చినపుడు ఒకలా, అవసరం లేనప్పుడు మరోలా ఉండటం వల్ల అధినేతలకు క్రెడిబులిటీ సమస్య వస్తుందని చర్చించుకుంటున్నారట తమ్ముళ్లు. తమని కరివేపాకులా చూడకుండా ఉంటే బాగుంటుదని కోరుకుంటున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.