P. Anand Mohan, Visakhapatnam, News18,
YCP Vs Pawan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ఉద్యమం ఇప్పుడు ఏ రూట్ తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.. అయితే విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రైవేటీకరణ చేస్తే.. పవన్ మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అనకుండా.. అందుకు దోషి ఏపీ ప్రభుత్వమే అంటూ ఫైర్ అయ్యారు. కేంద్రంలో పెద్దలకు మన బాధ ఏం అర్థమవుతుందని.. కేంద్ర ప్రభుత్వానికి మన కష్టాలు తెలియచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. అందుకే ఏపీ ప్రభుత్వాని (AP Government) కి వారం రోజుల డెడ్ లైన్ పెట్టారు. వారంలోగా స్టీల్ ప్లాంట్ పైన వైసీపీ ప్రభుత్వం తమ విధానం స్పష్టం చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. కేంద్రాన్ని ప్రశ్నించే మందు రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుందన్నారు. లేఖలతో తమ చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెట్టవద్దంటూ పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారని చెబుతూ..తన వెనుక ఒక్క ఎంపీ కూడా లేరని...ఒక్క ఎంపీ ఉన్నా..తాను ఏం చేసేవాడినో నిరూపించేవాడినని చెప్పుకొచ్చారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ ను జగన్ లెక్కచేయలేదు. మరి సవాల్ విసిరిన పవన్ ఇప్పుడు ఏం చేస్తారు..
ముందుగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలంటూ జనసేన అధినేత డిమాండ్ చేసారు. తమ పార్టీతో సహా మేధావులను సైతం ఆహ్వానించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం నుంచి వారంలోగా స్పందన రాకుండా తమ కార్యాచరణ ఏంటో వెల్లడిస్తామని పవన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ ఫిక్స్ చేసిన వారం రోజుల సమయం ముగిసిపోయింది. డెడ్ లైన్ పై స్పందించడం సంగతి ఎలా.. ఏపీ ప్రభుత్వం నుంచి భారీగా కౌంటర్లు వచ్చాయి. మంత్రి అప్పలరాజు అయితే దారుణమైన కామెంట్లు చేశారు. ఇంతకాలం గుడ్డి గాడిద పళ్లు తోమారా అంటూ విమర్శించారు. కానీ పవన్ వైపు నుంచి రివర్స్ కౌంటర్లు ఎక్కడా కనిపించలేదు.
ఇదీ చదవండి : హీటు పెంచుతున్న కుప్పం.. చంద్రబాబు వ్యూహం వర్కౌట్ అవుతుందా..?
వైసీపీ స్టాండ్ ఏంటి..?
ఇక వైసీపీ విషయానికి వస్తే.. ఇప్పటికే అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ప్రధానికి వరుసగా లేఖలు రాసారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరించ కుండానే ఏ విధంగా కొనసాగించవచ్చో సూచించారు. అఖిలపక్షం తో కలిసేందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే, ప్రధాని కార్యాలయం నుంచి దీని పైన స్పందన రాలేదు. రాష్ట్ర స్థాయిలో దీని పైన చేయటానికి ఏమీ లేదని..మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్..ఇప్పుడు తాము స్పందించకపోతే ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలనే ఉద్దేశంతో వైసీపీ కనిపిస్తోంది. కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయటం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందనేది వైసీపీ నేతల వాదన.
ఇదీ చదవండి :చంద్రబాబు స్టైల్ మార్చారా..? అధికారం లేకపోవడంతో తీరు మారిందా.. జోష్ లో తెలుగు తమ్ముళ్లు
కేంద్రంపై పోరాటం చేస్తారా..?
వైసీపీ స్పందించకపోవడంతో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎప్పటిలాగే వైసీపీని విమర్శలు చేస్తూ చేతులు దులుపుకుంటారా.. లేక చిత్త శుద్ధితో కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతారా.. ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారా అని ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పవన్ గాజువాక నుంచే పవన్ పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పవన్ సక్సెస్ అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తిరుగు ఉండదు.. అందుకే పవన్ ఉద్యమం విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి : దరువేసి చెప్పిన ఎమ్మెల్యే రోజా.. మొన్న కబడ్డీ.. నిన్న వాలీబాల్.. నేడు డప్పు వాద్యం..
పవన్ తీరుపై విమర్శలు..
ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన పవన్.. తరువాత ఆ విషయం పట్టించుకోవడం లేదని.. కామ్ గా సినిమాలు తీసుకుంటున్నారని.. ఆ మాత్రం దానికి డెడ్ లైన్ లు పెట్టడం ఎందుకని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి పవన్ ఎప్పటిలాగే పార్ట్ టైమ్ ఉద్యమానికి పరిమితం అవుతారా..? లేక శాశ్వతంగా కేంద్రంపై పోరాడుతారా అన్నది పోలిటికల్ సర్కిల్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతోంది.. ముఖ్యంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. కేంద్రం..బీజేపీతో సంబంధాల పైన ఎటువంటి ప్రభావం చూపుతుందనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పవన్ తన కార్యచరణ ప్రకటిస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Janasena, Pawan kalyan, Vizag Steel Plant