ANDHRA PRADESH POLITICAL NEWS LOCAL BODY MLC ELECTIONS NOTIFICATION RELEASE NOMINATIONS START TODAY NGS
AP MLC: ఏపీ స్థానికసంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్.. నేటి నుంచి నామినేషన్లు
స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
AP MLc: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోలహలం కొనసాగుతోంది. ఓ వైపు మిగిలిని పరిషత్ పోలింగ్ కొనసాగుతుండగా.. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖాలు చేశారు. తాజాగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.. నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
local bodies quota MLC elections: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)వరుసగా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఓ వైపు పరిషత్ పోలింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థులు సీఎం జగన్ (CM Jagan) ఇవాళ కలిశారు. కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్ బాషా, శ్రీకాకుళం జిల్లాకుచెందిన పాలవలస విక్రాంత్‌లు.. నామినేషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఎన్నికల అధికారి. ఇవాళ్టి నుంచి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. నవంబర్ 26 నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ. ఇక, ఈ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అయితే ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం.. దాదాపు అన్ని స్థానాలు ఏక గ్రీవంగానే ముగిసే అవకాశం ఉంది.. ప్రస్తుతం గుంటూరు, కృష్ణ, విశాఖపట్నం జిల్లాల్లో చెరో రెండు, అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఒక్కో ఖాళీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
డిసెంబరు 10 తేదీన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 16 డిసెంబర్ న కౌంటింగ్ జరగనుంది. నోటిఫికేషన్ జారీ అయిన దృష్ట్యా ఇవాళ్టి నుంచి ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. పెద్దల సభకు పంపించాల్సిన నేతల పేర్లపై వైసీపీ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది కూడా.
జిల్లాల వారీగా పలువురి పేర్లను పరిశీలించి ఇప్పటికే వారికి పచ్చ జెండా ఊపింది. అనంతపురం జిల్లాలో ఒకే ఎమ్మెల్సీ స్థానం ఉండగా.. విశ్వేశ్వర్‌రెడ్డి, శివరామిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో రెండు స్థానాలకు నుంచి తలశిల రఘురాం, లంకా వెంకటేశ్వరావు.. ఆశావహుల జాబితాలో ఉన్నారు. తూర్పు గోదావరిలో అనంతబాబు ఒక్కరి పేరే వినిపిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా… ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.
విజయనగరం నుంచి ఇందుకూరు రఘురాజు పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక- విశాఖలో రెండు స్థానాలకు వరుదు కల్యాణి, వంశీకృష్ణ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. చిత్తూరు జల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుండగా.. భరత్ పేరు ఫైనల్ అయినట్లు సమాచారం. ఈ సారి ఇక ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లేని వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు సీఎం జగన్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.