Home /News /politics /

ANDHRA PRADESH POLITICAL NEWS HEAT IN KUPPAM MUNICIPAL ELECTIONS CHANDRABABU NAIDU VS PEDDIREDDY NGS

Kuppam Municipal Election: హీటు పెంచుతున్న కుప్పం.. చంద్రబాబు వ్యూహం వర్కౌట్ అవుతుందా..?

కుప్పంపై వైసీపీ ఫోకస్

కుప్పంపై వైసీపీ ఫోకస్

Kuppam Municipal Election: మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం లో రాజకీయం రసవత్తరంగా మారింది. కుప్పంను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా కుప్పం వ్యవహారాలు చూస్తున్నారు. ఆయనకు ధీటుగా చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తే కేడర్ కు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ ఎన్నికలో ఓడితే చంద్రబాబు ఇమేజ్ పూర్తిగా డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

ఇంకా చదవండి ...
  Chandrababu Naidu vs Peddireddy:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికల (Municipal Election) నామినేషన్ లో తుదిఘట్టానికి చేరుకుంది. ఉపసంహరణ గడువు నేటితో ముగుస్తోంది. దీంతో బరిలో ఎంతమంది అభ్యర్థులు ఎంత మంది ఉన్నారన్నది నేడు క్లారిటీ రానుంది. అయితే ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సొంత నియోజకవర్గమైన కుప్పం (Kuppam)మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు హీటు పెంచుతోంది. పేరుకు ఇది ఒక్క మున్సిపల్ ఎన్నికే అయినా.. నియోజకవర్గం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఈ ఎన్నికలలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రకాశ్‌ను సొంత పార్టీ నేతలే కిడ్నాప్‌ చేశారంటూ ఆయన సోదరుడు ఫిర్యాదు చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే, ప్రకాష్ సోదరుడు కిడ్నాప్ ప్రకటన తరువాత తానేమీ కిడ్నాప్ కాలేదని ప్రకాశ్‌ స్వయంగా ప్రకటించడం ఎన్నికల వేడిని రాజేసింది. కుప్పం మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి వెంకటేశ్‌, ప్రకాశ్‌ టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేయగా.. వెంకటేశ్‌ నామినేషన్ తిరస్కరణకు గురైంది. తరువాత ఆదివారం ప్రకాశ్‌ అన్న గోవిందరాజు.. తన తమ్ముడు​తోపాటు కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతకు ముందే నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వారిపై దాడి చేసి పత్రాలను చించేసిన ఘటనల నేపథ్యంలో గోవిందరాజు చేసిన కిడ్నాప్ ఆరోపణలు సంచలనంగా మారాయి.

  ఉదయం గోవిందరాజు ఫిర్యాదు చేయగా సాయంత్రం తాము కిడ్నాప్‌నకు గురికాలేదంటూ ప్రకాశ్‌ కుటుంబ సభ్యులు వీడియో విడుదల చేయడంతో ఇది మరో కొత్త మలుపు తీసుకుంది. ఇదంతా అధికార వైసీపీ రాజకీయ ఎత్తుగడలో భాగమని టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ అభ్యర్థుల కుటుంబ సభ్యులను అడ్డు పెట్టుకొని తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా గెలిచేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. దీనికి తోడు జిల్లా స్థాయి స్థానిక నేతలంతా ఇక్కడే మకాం వేసి పావులు కదుపుతుండడంతో కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కోణాన్ని తనవైపుకు తిప్పుకుంది.

  ఇదీ చదవండి: చంద్రబాబు స్టైల్ మార్చారా..? అధికారం లేకపోవడంతో తీరు మారిందా.. జోష్ లో తెలుగు తమ్ముళ్లు

  కేవలం కుప్పం అనే కాదు చిత్తూరు జిల్లా రాజకీయాలు మొత్తం వేడెక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ పొలిటికల్‌ హీట్‌ నడుస్తోంది. ఇద్దరూ ఎస్వీ యూనివర్సిటీలో చదువుకొనే రోజుల నుంచే ప్రత్యర్థులు. 2014 ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగింది. 2019లో కుప్పంలో చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మంత్రిగా కేబినెట్‌లో.. వైసీపీలో కీలకంగా ఉన్న ఆయన.. ఆపరేషన్‌ కుప్పం చేపట్టి అక్కడ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య శ్రీకాళహస్తిలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా చంద్రబాబు గెలవలేరని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే తాను రిటైర్మెంట్‌ తీసుకుంటానని ప్రకటించారాయన. దమ్ముంటే పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లిలో ఎక్కడ నుంచైనా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు కూడా. టీడీపీ అధినేత కుప్పాన్ని మర్చిపోవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  ఇదీ చదవండి: దరువేసి చెప్పిన ఎమ్మెల్యే రోజా.. మొన్న కబడ్డీ.. నిన్న వాలీబాల్.. నేడు డప్పు వాద్యం..

  మంత్రి పెద్దిరెడ్డి ఎన్ని విమర్శలు చేసినా.. ఇన్నాళ్లూ స్పందించని చంద్రబాబు.. ఈసారి కుప్పం పర్యటనలో మాత్రం తొలిసారి పెదవి విప్పారు. నేరుగా పెద్దిరెడ్డికే గురిపెట్టారు. ఈసారి పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానని సవాల్‌ విసిరారు చంద్రబాబు. దాంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. చంద్రబాబు ఎందుకు ఈ సవాల్‌ చేశారు? వరస ఓటములతో డీలాపడ్డ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకొచ్చేందుకు ఈ మాటలు అన్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అని ఆరా తీస్తున్నారట.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu naidu, Kuppam, Peddireddy Ramachandra Reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు