Home /News /politics /

ANDHRA PRADESH POLITICAL NEWS GROUP WAR BETWEEN YCP SENIOR AND JUNIOR LEADERS DADI VS GUDIVADA NGS VSP

AP Politics: అధికార వైసీపీలో పెరుగుతున్న వర్గ పోరు.. వైసీపీ సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాల !

దాడి వర్సెస్ గుడివాడ

దాడి వర్సెస్ గుడివాడ

AP Politics: అధికార వైసీపీ రోజు రోజుకూ వర్గ పోరు పెరుగుతోంది. ఓ వైపు ఎన్నిక ఏదైనా అధికరా పార్టీ వరసు విజయాలు సాధిస్తోంది. దీంతో పార్టీలో అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం వర్గ పోరు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ సీనియర్లలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి.

ఇంకా చదవండి ...
  YCP Seniors vs Juniors:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రస్తుతం అధికార పార్టీకి తిరుగులేదనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలే.. 2019 సాధారణ ఎన్నికల తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అధికార పార్టీదే విజయం అవుతోంది. ప్రతిపక్షాలు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి. ఇలా చూస్తే పార్టీ చాలా పటిష్టంగా ఉందని లెక్కలేసుకోవచ్చు.. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం రోజు రోజుకూ వర్గపోరు పెరుగుతోంది. అందుకు తాజా నిదర్శనం అనకాపల్లి (Anakapalli) నియోజకవర్గం.. అక్కడ ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రికి ఓ జూనియర్ ఎమ్మెల్యే వర్గం చెక్ పెడుతోంది. 30 ఏళ్ల అనుభవంలో ఎన్నడూ చూడని పరిణామాలు సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాలలు రగిలించాయి. వర్గ రాజకీయాలతో విసిగెత్తిపోయిన ఆయన ఎక్కువ కాలం భరించడం కష్టం అనుకున్నారో  ఏమో కానీ…కుండబద్దలు కొట్టేశారు. తనకు సీఎం జగన్ (CM Jagan) తప్ప బాస్‌లు ఎవరూ లేరని బహిరంగంగానే ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) అనకాపల్లి వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు బలమైన రాజకీయ ప్రత్యర్ధులు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా, మంత్రిగా, శాసనమండలి ప్రతిపక్ష నేతగా పని చేసిన అనుభవం  దాడికి  ఉంది. ఎప్పుడూ రాజకీయంగా ప్రత్యర్ధితోనే పోరాటం చేసిన దాడికి తొలిసారి వింతైన అనుభవం సొంత పార్టీ నుంచే ఎదురవుతోంది. అధికార పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్నాథ్‌ కు మధ్య గ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యమే.

  ఇటీవల ఆ దూరం బాగా పెరిగిపోవడమే కాదు… ఒకరి వర్గంను మరొకరు టార్గెట్ చేసుకునే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు మాజీ మంత్రిని ఆహ్వానించకుండా పక్కన పెట్టేసిందట ఎమ్మెల్యే గ్రూప్. తమతో కలిసి రావడం లేదని హైకమాండ్‌కు చెప్పేందుకు ఇలా కుట్ర చేస్తున్నారని దాడి వర్గం భావిస్తోంది. ఇటీవల నెహ్రు చౌక్‌లో చేపట్టిన జనాగ్రహ దీక్షకు పిలవని పేరంటమే అయినా దాడి వెళ్లివచ్చారు. దీనికి కారణం ఉందట. చంద్రబాబు (Chandra Babu)కు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లకపోతే టీడీపీ (TDP)కి తాను అనుకూలం అనే ప్రచారం చేస్తారనే అనుమానంతోనే వెళ్లారట. జగన్ పాదయాత్రకు నాలుగేళ్లు అయిన సందర్భంగా ఎమ్మెల్యే వర్గం, దాడి గ్రూప్ వేరు వేరుగానే ర్యాలీలు నిర్వహించాయి.

  ఇదీ చదవండి : సీఎం జగన్ మేక కాదు.. పులి.. సోనియాను ఎదురించిన మగాడు ! చంద్రబాబు, పవన్ లపై తిట్ల దండకం..

  ఇలా చూస్తూ వదిలేస్తే ఎమ్మెల్యే వర్గం రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే అనుమానం దాడిలో కనిపిస్తుందట. అందుకే ఎమ్మెల్యే వర్గం పిలిచినా.. పిలవకపోయినా.. కార్యక్రమాలకు వెళ్లటంతో పాటు.. తనకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్‌ లేదనే విషయాన్ని బహిర్గతం చేయటం ద్వారా.. ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నది దాడి ప్లాన్ అట.

  ఇదీ చదవండి : నామినేషన్ల ఉప సంహరణ రచ్చ రచ్చ.. ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు.. ఆందోళనలు

  అదే వేదికపై నుంచి దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు సీఎం ఒక్కరే బాస్ అని జగన్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని కుండ బద్దలు కొట్టేశారు. తద్వారా ఎమ్మెల్యే అమర్నాథ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదనే సంకేతాలు పంపించారు వీరభద్రరావు.  ఈ పరిణామాల వెనుక పవర్ పాలిటిక్స్ కారణం అనేది అనకాపల్లి గురించి తెలిసిన వారికి ఇట్టే అర్ధం అవుతుంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు