హోమ్ /వార్తలు /National రాజకీయం /

TDP War: ఏపీ టీడీపీలో ముదురుతున్న వార్.. అచ్చెన్న వర్సెస్‌ కళా వెంకట్రావు..! పై చేయి ఎవరిది..?

TDP War: ఏపీ టీడీపీలో ముదురుతున్న వార్.. అచ్చెన్న వర్సెస్‌ కళా వెంకట్రావు..! పై చేయి ఎవరిది..?

అచ్చెన్న వర్సస్ కళా

అచ్చెన్న వర్సస్ కళా

TDP Group War: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ఎన్నికలు అంటే స్థానిక నేతలు భయపడే పరిస్థితి నెలకొంది. గత సాధారణ ఎన్నికల తరువాత జరిగిన ఒక్క ఎన్నికలోనూ అధికార వైసీపీ దూకుడును టీడీపీ అడ్డుకోలేకపోయింది. ముఖ్యంగా కీలక నేతల తీరుతోనే ఈ పరిస్థితి నెలకొంది అనే విమర్శలు ఉన్నాయి. అయినా పార్టీలో పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న నేతల తీరు మాత్రం మారడం లేదు. వర్గ పోరుతో పార్టీని మరింత ఇరకాటంలో పెడుతున్నారు..

ఇంకా చదవండి ...

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh)లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. కీలక నేతలు కూడా ఎవరికి వారు గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని కేడర్ మదనపడుతున్నారు. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు.. మాజీ అధ్యక్షుడి మధ్య వార్‌ నడుస్తోందానే ప్రచారం ఉంది. పార్టీ నుంచి బహిష్కరించిన నేతకు ప్రాధాన్యం ఇవ్వడంతో నిప్పు రాజుకుందని కేడర్ చర్చించుకుంటోంది. మరి శ్రీకాకుళం (Srikakulam) టీడీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  కళా వెంకట్రావు (Kala venkatrao) వ్యతిరేక వర్గానికి రాష్ట్ర టీడీపీ అధ్కక్షుడు అచ్చెన్నాయుడు  (Atchem Naidu)  ప్రోత్సహిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారే.. కళా మాజీ అధ్యక్షుడైతే.. అచ్చెన్న ప్రస్తుత అధ్యక్షుడు.. కేవలం జిల్లా రాజకీయాలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పటిష్ఠ పరచాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంది. అయితే ఇద్దరూ పైకి నవ్వుతూ కనిపించినా.. వారి మధ్య కోల్డ్‌ వార్‌ ఉందన్నది పార్టీలో అందిరికీ తెలిసిందే.

కళా వెంకట్రావును ఇబ్బంది పెట్టేందుకు అచ్చెన్న సర్వశక్తులు ఒడ్డుతున్నారని జిల్లాలో హాట్ హాట్‌ డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. కొంతకాలంగా ఎచ్చెర్లలో కళాకు వ్యతిరేకంగా ఉన్న కొందరు చోటామోటా లీడర్లను అచ్చెన్న ఎంకరేజ్‌ చేస్తున్నారట. అచ్చెన్న ఎంకరేజ్‌ చేస్తున్నవారిలో టీడీపీ నుంచి బహిష్కరణ వేటుపడ్డవాళ్లు కూడా ఉన్నారని అంటున్నారు.

ఇదీ చదవండి: ఇన్నిరోజులు గుడ్డి గాడిద పళ్లు తోమారా? పవన్‌ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల జిల్లాలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమంలో పార్టీ నుంచి బహిష్కరించిన ఓ నాయకుడు అచ్చెన్నతో రాసుకుని పూసుకుని తిరిగారట. అది చూసి పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి టీడీపీ బ్యానర్‌పైనే కార్యక్రమాలు చేపడుతున్నారట. దీంతో అతడికి టీడీపీ సంబంధం లేదని అప్పట్లో ప్రకటన జారీ చేశారు. అయినా అతను ఆగడం లేదట. ఇప్పుడు అచ్చెన్నతో అంటకాగడంతో చర్చగా మారింది. కళా వెంకట్రావు విషయంలోనే ఇలా చేస్తే.. ఇక తమలాంటి వారి పరిస్థితి ఏంటని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారట.

ఇదీ చదవండి: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కమెడియన్.. పోటీ చేసేది ఎక్కడ నుంచి అంటే..?

చంద్రబాబు దీక్షకు వచ్చిన బహిష్కృత నేత                                                 ఇటీవల చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకుర్గ ఆ బహిష్కృత నేత హాజరయ్యారని కళా వర్గం చెబుతోంది. రణస్థలం మండలానికి చెందిన కాపు సామాజిక వర్గ నేత.. 50 వేల రూపాయల విరాళాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆ నేతను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మాస్క్‌ ధరించి వేదిక మీదకు వచ్చేలా ప్లాన్‌ చేశారని చెబుతున్నారు. దీనికి కూడా అచ్చెన్న అండదండలు ఉన్నట్టు జిల్లాలో టాక్‌. పార్టీ నుంచి బహిష్కరించిన వ్యక్తిని ఏకంగా టీడీపీ ఆఫీస్‌లోకి తీసుకురావడం.. చంద్రబాబు దీక్షా వేదిక దగ్గరకు పంపడం మామూలు విషయం కాదని అనుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఉల్లాసంగా ఉత్సాహంగా ఉప రాష్ట్రపతి మార్నింగ్ వాక్.. ఈ వయసులో ఫిట్ నెస్ సీక్రెట్ అదే..

చంద్రబాబు దీక్ష తరువాత తిరిగి శ్రీకాకుళానికి వచ్చాక మరింత దూకుడుగా ఆయన వ్యవహరిస్తున్నారని కళా వర్గం ఆరోపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎచ్చెర్ల టికెట్‌ కళాకు కాకుండా తనకే వస్తుందని ఓపెన్‌గానే ప్రచారం చేసుకుంటున్నట్టు సమాచారం. దాంతో అచ్చెన్న, కళా వెంకట్రావుల మధ్య ఈ వర్గపోరు ఎక్కడికి దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kinjarapu Atchannaidu, Srikakulam