Home /News /politics /

ANDHRA PRADESH POLITICAL NEWS CM JAGAN MOHAN REDDY TOMORROW GOING TO ODISHA MEET WIHT CM NAVEEN PATNAIK NGS

CM Jagan: రేపు ఒడిషాకు సీఎం జగన్.. అక్కడి సీఎంతో చర్చించే అంశాలు ఎంటంటే.. షెడ్యూల్ ఇదే

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

CM Jagan Odisha schedule: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రేపు ఒడిషా వెళ్లనున్నారు. అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ తో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చిస్తారు. అయితే వీరిద్దరి మధ్య ఏఏ అంశాలు చర్చకు రానున్నాయి..? ముఖ్యంగా కొఠియా గ్రామాల సమస్య కు పరిష్కారం లభిస్తుందా అనేది ఆసక్తి పెంచుతోంది.

ఇంకా చదవండి ...
  CM Jagan Odisha Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు ఒడిషా (Odisha) పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు. రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తో భేటీ కానున్నారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్ (Bhuvaneswar)లోని నవీన్ పట్నాయక్ నివాసంలో రెండు గంటల పాటు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. బార్డర్ విషయాలను కూడా చర్చించనున్నారు. తరువాత ఏడు గంటల 15 నిమిషాలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణ అవుతారు సీఎం జగన్ (CM Jagan). ఇక రేపు రాత్రి 9 గంటల ప్రాంతంలో తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎం జగన్ ఒడిషా పర్యటన సన్నాహక సమావేశం జరిగింది. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో రేపటి భేటీలో ప్రస్తావించాల్సిన అంశాల పై సమావేశంలో చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు, నీటి వివాదాల (Water disputes)పరిష్కారం దిశగా కసరత్తు జరుగుతొంది.

  జగన్, పట్నాయక్ భేటీలో జల వివాదాలకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉంటాయని అధికారవర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు, జంఝావతి రిజర్వాయర్‌, నేరడి బ్యారేజీ లాంటి ప్రాజెక్టులపై ఒడిశా సర్కారు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేలా జగన్ పర్యటన ఉంటుందని, సీఎం వెంట జలవనరుల శాఖకు చెందిన అధికారులు కూడా ఒడిశా వెళతారని ఏపీ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ ప్రాజెక్టుల వల్ల ఒడిశాకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని, సరిహద్దులో నిర్మించే ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు కలిసి వాడుకునేలా జగన్ చర్చిస్తారని తెలుస్తోంది. జల వివాదాలపై తానే వస్తానంటూ ఏసీ సీఎం జగన్ గత ఏప్రిల్ లో రాసిన లేఖకు సానుకూల స్పందనగా నవీన్ పట్నాయక్ ఆహ్వానం పంపడంతో సీఎం జగన్ ఇప్పుడు ఒడిషాకు వెళ్తున్నారు.

  ఇదీ చదవండి : ముగిసిన పవన్ డెడ్ లైన్.. లైట్ తీసుకున్న అధికార వైసీపీ.. మరి జనసేనాని ఏం చేస్తారు..?

  ఏపీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఒడిశాకు వెళుతోన్న జగన్.. పట్నాయక్ తో ఏం మాట్లాడబోతున్నారో ఇప్పటికే అజెండా ఖరారైంది. అయితే, రెండు రాష్ట్రాల మధ్య ఐదు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కొటియా గ్రామాల వివాదంపై ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటారా? లేదా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారులైతే దీనిపై స్పందించడం లేదు. సరిహద్దుల్లో తరచూ చోటుచేసుకుంటోన్న ఉద్రిక్తతలకు సీఎంలు పరిష్కార మార్గాలు వెతుకుతారా? ఏపీలో కలుస్తామంటోన్న కోటియా గ్రామస్తుల ఆశ నెరవేరేలా జగన్ ప్రయత్నాలు చేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..

  ఇదీ చదవండి : హీటు పెంచుతున్న కుప్పం.. చంద్రబాబు వ్యూహం వర్కౌట్ అవుతుందా..?

  ఏపీ-ఒడిశా సరిహద్దు వివాదాలు
  విజయనగరం-కోరాపూట్ జిల్లాల మధ్య కోటియా గ్రామాల వివాదం కొనసాగుతుండగా, ఆంధ్ర -ఒడిశా సరిహద్దులోనే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కౌశల్యాపురం పోలింగ్‌ స్టేషన్‌ వద్ద రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో.. జిల్లాలోని కౌశల్యాపురం ప్రాథమిక పాఠశాలలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కోసం ఆంధ్రా అధికారులు ఏర్పాట్లు చేయగా, ఒడిశా అధికారులు అక్కడికి వచ్చి.. భూభాగానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నందున ఎన్నికలు నిర్వహించొద్దంటూ అడ్డుకున్నారు. దీనిపై సీతంపేట ఐటీడీఏ పీవో జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జగన్-పట్నాయక్ భేటీలో సరిహద్దు వివాదాలు చర్చకు వస్తాయా, లేదా అనేది ఉత్కంఠగా మారింది.
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Naveen Patnaik, Odisha

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు