Home /News /politics /

ANDHRA PRADESH POLITICAL NEWS CM JAGAN GAVE B FORM TO MLA QUOTA MLC FOR YSRCP NGS

AP MLC: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు బ్యాక్ గ్రౌండ్ ఇదే.. అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం జగన్‌

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వీరే

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వీరే

AP MLc: సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పాద యాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. విధేయతకు పెద్ద పీట వేశారు.. ఎమ్మెల్యే కోటాలో ముందు మాట ఇచ్చిన ముగ్గురుకీ అవకాశం కల్పించారు. అలాగే స్థానిక సంస్థల కోటాలోనూ విదేయత.. సామాజిక సమీకరణాలకు పెద్ద పేట వేశారు. ఇవాళ అభ్యర్థులు ముగ్గురుకీ సీఎం జగన్ భీ ఫారాలు అందజేశారు.

ఇంకా చదవండి ...
    YSRCP Mlc: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థులు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ని  ఇవాళ కలిశారు. కడప జిల్లా (Kadapa District) కు చెందిన డీసీ గోవిందరెడ్డి, కర్నూలు జిల్లా (Kurnool District)కు చెందిన ఇషాక్ బాషా, శ్రీకాకుళం జిల్లా (Srikakulam  District )కుచెందిన పాలవలస విక్రాంత్‌లకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని సీఎం జగన్ గతంలోనే హామీ ఇచ్చారు. కష్టం సమయంలోనూ పార్టీ కోసం కష్ట పడ్డవారిని తప్పక గుర్తిస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారు.. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం వారి ముగ్గురినీ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు.. అయితే మొత్తం ఏపీ వ్యాప్తంగా 14 స్థానాలు ఖాళీలు ఉండగా, ఆశావాహుల సంఖ్య మాత్రం పెద్ద సంఖ్యలో ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది.

    సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు జగన్. ఈ క్రమంలోనే ముగ్గురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గోవిందరెడ్డి, ఇషాక్ భాషా, విక్రాంత్‌కు అవకాశం కల్పించారు. వారు ముగ్గురూ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేశారు. అటు నుంచి నేరుగా సెక్రటేరియట్‌కు వెళ్లి ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు..



    నామినేషన్ల వేసిన వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..? ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపికైన దేవసాని చిన్న గోవిందరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. అంతే కాదు పార్టీ వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. అధికారంలో లేనప్పుడు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు. మరోవైపు అధికారిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో గ్రూపు–1లో ఎంపికై రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా పనిచేశారు.

    ఇదీ చదవండి: మళ్లీ టీడీపీవైపు చూస్తున్న కీలక నేత.. బీజేపీ తో లాభం లేదనుకున్నారా..?

    డిప్యూటీ కమిషనర్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా పదోన్నతి పొంది 2001లో రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. వైఎస్సార్‌ మరణం తరువాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెలకొల్పిన వైఎస్సార్‌సీపీలో చేరి.. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విదేయుడిగా కొనసాగుతున్నారు. అధినేత ఆదేశాల మేరకు ఆ పార్టీ తరఫున 2014లో జయరాములు, 2019లో డాక్టర్‌ వెంకట సుబ్బయ్యలను ఎమ్మెల్యేలుగా గెలిపించారు.

    ఇదీ చదవండి: స్నేహమంటే ఇదేరా.. జాతి వైరం మరిచి సాయం చేసుకుంటున్న కోతి-కుక్క.. హద్దులు లేని ఫ్రెండ్ షిప్

    వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్‌ సుధను 90వేలకు పైగా మెజారిటీతో గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. అందుకే పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తించి జగన్.. ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

    ఇదీ చదవండి: విశాఖ టు మధ్య ప్రదేశ్.. రూటు మార్చిన గ్యాంగ్.. అమెజాన్ లో గంజాయి.. ఏ పేరుతో అమ్మారో తెలుసా?

    శ్రీకాకుళానికి చెందిన పాలవలస విక్రాంత్ పార్టీకి విదేయుడిగా గుర్తింపు పొందారు. అందుకే ఎమ్మెల్యే కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయనకు రాజకీయ కుటుంబ నేపథ్యం బాగానే ఉంది. పాలవలస కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడో తరం నాయకుడు విక్రాంత్..

    ఇదీ చదవండి: టీడీపీకి బూస్ట్ ఇచ్చిన అమిత్ షా వ్యాఖ్యలు.. ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఇదే

    విక్రాంత్ తాత పాలవలస సంఘం నాయుడు, నాయనమ్మ రుక్ముణమ్మ ఉణుకూరు ఎమ్మెల్యేలుగా సేవలందించారు. తండ్రి రాజశేఖరం కి కూడా పూర్తి రాజకీయ అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, జెడ్పీ చైర్మన్‌గా సేవలందించారు. ఇక విక్రాంత్ కూడా డీసీసీబీ చైర్మన్ గా పని చేశారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

    ఇదీ చదవండి: పొలిటికల్ పంచ్ లే కాదు.. ఆటల్లోనూ అదుర్స్ అనిపిస్తున్న ఎమ్మెల్యే రోజా.. త్రో బాల్ పిక్స్ వైరల్

    ఇక కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇసాక్‌బాషా కూడా పార్టీకి వీర విదేయుడిగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా మైనార్టీ వర్గ నేతగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి చాలా వరకు కష్టపడ్డారు. 2018లో వైఎస్సార్‌సీపీ నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, నంద్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీ కోసం ఆయన చేసిన శ్రమను గుర్తించిన సీఎం జగన్.. ఇప్పుడు ఎమ్మల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు..

    ఇక ఆ ముగ్గురితో పాటు.. వైసీపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే:


    ఇందుకూరు రాజు (విజయనగరం)
    వరుదు కళ్యాణి (విశాఖ)
    వంశీ కృష్ణయాదవ్ (విశాఖ)
    అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి)
    మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా)
    తలశిల రఘురామ్ (కృష్ణా)
    ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు)
    మురుగుడు హనుమంతరావు (గుంటూరు)
    తూమాటి మాధవరావు (ప్రకాశం)
    కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు)
    వై శివరామిరెడ్డి (అనంతపురం)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap mlc elections, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు