AP Minster On TDP-janasena: ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) సొంత జిల్లాలో ఎన్నిక అంటే ప్రత్యర్థి పార్టీలు ఆశలు దాదాపు వదులుకోవాల్సిందే.. అందులోనూ ఉప ఎన్నిక అంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది కాదనలేని సత్యం.. అయితే గత సంప్రదాయాలు, సెంటిమెంట్ పేరుతో ప్రధాన పార్టీలు తెలుగు దేశం (Telugu Desam) , జనసేన (Janasena) పార్టీలో బద్వేల్ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి. దీంతో ఎన్నిక ఏక గ్రీవం అవుతుంది అనుకుంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమరానికి సై అన్నాయి. దీంతో వార్ వన్ సైడ్ అవుతుందని అంతా ఊహించారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం.. సత్తా చాటుతామని.. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకున్నాయి. గెలుపు సంగతి ఎలా ఉన్నా అధికార పార్టీ మెజార్టీని బాగా తగ్గిస్తామని తొడలు కొట్టాయి. కానీ ఫలితం రివర్స్ లో వచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో రికార్డు మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ (Dr dasari sudha) గెలుపొందారు. సీఎం జగన్ గత మెజార్టీని సైతం ఆమె క్రాస్ చేశారు. ఈ ఓటమి తరువాత తమదే నైతిక విజయమని బీజేపీ (BJP) నేతలు అంటుంటే.. వైసీపీ నేతతలు మాత్రం.. ఇది టీడీపీ, జనసేన ఓటమి అంటున్నారు. ఇంతకి ఎవరి వాదన ఏంటి..?
బద్వేల్ ఉప ఎన్నిక (Badvel By Poll)లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధమ్మ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థిపై ఆమె ఏకంగా 90,533 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై విమర్శలు చేశారు. బద్వేల్ ప్రజలు కేవలం బీజేపీనే కాదు.. టీడీపీ, జనసేనలను కూడా ఓడించారన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన.. బరిలో నిలవనప్పటికీ బీజేపీ అభ్యర్థిని మోసుకొచ్చారని ఎంపీ ఆరోపించారు. ముఖ్యంగా చంద్రబాబు తెర వెనుక ఉంటూ బీజేపీకి 20వేల ఒట్లు వేయించారని నందిగం సురేశ్ తెలిపారు. ఇక ఉప ఎన్నికలకు వెళ్లనంటూనే బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు పలికారని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చదవండి: ఏపీ ప్రజలకు జగనన్న బాణాసంచా కానుక..! ఇదేం పథకం అనుకుంటున్నారా..? క్రేజ్ అంటే ఇది
అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలి..
వైసీపీని చూస్తే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. ఈకారణంగానే కుప్పంలో ఉండమంటారా? వద్దా? అని తన నియోజకవర్గ ప్రజలను అడిగే స్థాయికి ఆయన చేరుకున్నారు. జగన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయన బినామీలు మాత్రమే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. రైతుల పాదయాత్రలో ఏవైనా గొడవలు జరిగితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలి అన్నారు నందిగం సురేష్..
ఇటు బీజేపీ నేతలు సైతం నైతికంగా బీజేపీదే విజయం అంటున్నారు. వైసీపీ పతనం ప్రారంభమైంది అంటున్నారు. దానికి వారు చెప్పే లాజిక్ ఏంటంటే..? కేవలం డబ్బులు పంచి.. పోలీసులను అడ్డం పెట్టుకుని రిగ్గుంగు చేస్తేనే వైసీపీ గెలిచిందని లేకుంటే కచ్చితంగా ఓడేదని ఆరోపిస్తున్నారు.. ఓటమి భయంతోనే భారీగా ఖర్చు చేసి వైసీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, Ap cm jagan, AP News, AP Politics, Janasena, TDP, Ycp