Home /News /politics /

ANDHRA PRADESH POLITICAL NEWS BADVEL BY POLL COUNTING TOMORROW YCP LEADERS CONFIDENCE ON VICTORY NGS

Badvel bypoll: బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఈ ఫలితం తరువాత ఏపీలో పొత్తులపై క్లారిటీ..!

బద్వేల్ బై పోల్ కౌంటింగ్ రేపే

బద్వేల్ బై పోల్ కౌంటింగ్ రేపే

Badvel bypoll: ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు ఎన్నికల హీట్ మళ్లీ మొదలైంది.. మరోవైపు రేపు కడప జిల్లాలోని బద్వేల్ బై పోల్ కౌంటింగ్ జరగనుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారు. అయితే ఈ ఎన్నిక ఫలితం పై పెద్దగా ఉత్కంఠ లేకపోయినా.. ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి..? రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై క్లారిటీ రానుంది.

ఇంకా చదవండి ...
  Badvel By Election Counting: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కడప జిల్లాలో బద్వేల్ (Badvel) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. తరువాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భారీ భద్రత నడుమ భద్ర పరిచారు. ఫలితం ఎలా ఉంటుంది అన్నది రేపు క్లారిటీ రానుంది. మంగళవారం పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ జరగనుంది. 281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. నాలుగు హాళ్లలో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి ఈవీఎం (EVM)లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించడం జరుగుతుందని వెల్లడించారు. కొన్ని టేబుళ్లు పెరిగే అవకాశం ఉందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ 233, సర్వీస్ ఓటర్లు ముందుగా లెక్కగడుతామని తెలిపారు. వీటి ఫలితాలు 8 గంటల తర్వాత వస్తాయన్నారు. మొత్తం పది రౌండ్స్ లో ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటలకే కౌంటింగ్ (Counting) పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫలితంపై ఎవరికి పెద్దగా అనుమానం లేదు.. అధికార వైసీపీదే విజయం అన్నది అందరూ అంచనా వేస్తున్నదే.. అయితే సెకెండ్ ప్లేస్ లో ఉండే పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నదానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ (TDP), జనసేన (Janasena) లు పోటీ లేకపోవడంతో.. ఆ రెండు పార్టీల ఓట్లు తమకే పడతాయని.. బీజేపీ (BJP) భారీ ఆశలు పెట్టుకుంది. మరి వారి అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో అన్నదానికి రేపు క్లారిటీ రానుంది.

  బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2, 15, 392 ఉండగా.. 1,46,562 ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో బద్వేల్ బరిలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేల్‌ బరిలో 15 మంది అభ్యర్ధులున్నా.. ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే. గత ఎన్నికల్లో లక్షా 58వేల ఓట్లు పోలైతే అందులో 60శాతం ఓట్లు ఒక్క వైసీపీకే వచ్చాయ్. బీజేపీ, కాంగ్రెస్‌కి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. కానీ ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు.. టీడీపీ, జనసేన ఓట్లు కూడా తమకే వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది.

  ఇదీ చదవండి: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కమెడియన్.. పోటీ చేసేది ఎక్కడ నుంచి అంటే..?

  2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్‌ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్త పది రౌండ్స్ లో ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటలకే కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో పార్టీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేసింది వైసీపీ పార్టీ. మెజార్టీ మాత్రం తగ్గిస్తామని బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు.

  ఇదీ చదవండి: నెల్లూరు.. తిరుమలలో కుండపోత.. మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వానలు

  ఈ ఉప ఎన్నికలో వైసీపీ గెలుస్తుందని ప్రత్యర్థి పార్టీలే చెబుతున్నాయి. అయితే ఈ ఎన్నిక ఫలితం తరువాత ఏపీలో పొత్తులపైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ నిజంగా గట్టి పోటీ ఇవ్వ గలిగితే.. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్లడానికి ప్రయత్నిస్తాయి.. అలా అయితే మెరుగైన ఫలితం వస్తుందని ఓ క్లారిటీ వస్తుంది.. ఇక బీజేపీ ఈ ఉప ఎన్నికలో పెద్దగా ప్రభావం చూపించకపోతే.. ఆ పార్టీకి బై బై చెప్పి.. టీడీపీ-జనసేన కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP News, AP Politics, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు