ANDHRA PRADESH POLITICAL NEWS AP MINSTER BUGGAN CALRITY ON PETROL PRICE AND VAT NGS
AP Minster Buggana: పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గింపుపై ఏపీ నిర్ణయం ఇదే.. మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన
AP Minster On petrol: ఏపీలో పెట్రోల్ మంటలు సెగలు రేపుతున్నాయి. అధికార వైసీపీ-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేట్లు ఎందుకు తగ్గించడం లేదంటూ బీజేపీ నేతల పదే పదే విమర్శలు చేస్తూ నిరసనలకు పిలుపు ఇస్తున్నారు. ఇటు వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో ఫైర్ అవున్నారు. తాజాగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పెట్రోల్ డీజీల్ రేట్ల తగ్గింపుపై క్లారిటీ ఇచ్చారు.
AP Minster On petrol: పెట్రోల్ రేట్ల (petrol rate) వ్యవహారం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సెగలు పుట్టిస్తోంది. వైసీపీ-బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలాలా చేస్తున్నాయి.. ఏపీ ప్రభుత్వం(AP Government) తీరుపై బీజేపీ(BJP) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ రేట్లు తగ్గిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని విమర్శలు చేస్తున్నారు. అదే స్థాయిలో ఏపీ మంత్రులు (AP Minsters), వైసీపీ నేతలు (YCP leaders) కౌంటర్లు ఇస్తున్నారు. నేరుగా పేపర్ లో కూడా ప్రకటన వేసింది ఏపీ ప్రభుత్వం.. తాజాగా దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన (AP Minster buggana) కూడా స్పందించారు.
ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. అంతకుముందు ఇద్దరు సహాయమంత్రులను కూడా బుగ్గన కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన ఓ కాంట్రాక్ట్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో ఉందని.. లండన్‌లో మొదటి దఫా ఆర్బిట్రేషన్ జరిగిందని.. ఇప్పుడు రెండో దఫా జరగాల్సి ఉందన్నారు. న్యాయపరమైన అంశాలు కాబట్టి వీటిలో జాప్యం జరుగుతోందని బుగ్గన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు.
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం చెప్పామని.. ప్రస్తుతానికి తాము వ్యాట్ తగ్గించే పరిస్థితి లేదని బుగ్గన స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా అని.. తాము 24 గంటల్లో నిర్ణయాలు తీసుకోలేమన్నారు. కేంద్ర ఖర్చులు వేరు.. రాష్ట్రాల ఖర్చులు వేరు అని గుర్తుపెట్టుకోవాలి అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆదాయ వనరులు చాలా అవసరమని.. రాష్ట్రానికి చమురు ఉత్పత్తులు, మద్యం ద్వారా మాత్రమే నేరుగా పన్నుల రూపంలో ఆదాయం వస్తోంది అన్నారు. మిగతావన్నీ జీఎస్టీ పరిధిలో ఉన్నాయని.. అందువల్ల రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలు అంత సులభంగా తీసుకోలేమని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి కాబట్టి.. ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పెట్రోల్ రేట్లు తగ్గింపు విషయంలో తప్పు తమది కాదని ప్రజలకు తెలియజేసేందుకు పేపరు ప్రకటన ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. లీటరు పెట్రోల్ ధరను 100 రూపాలయకు పైగా పెంచి.. ఇప్పుడు కేవలం ఐదు రూపాయలు, పది రూపాయలు తగ్గించామని పెంచినవల్లే నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉందా? అని ఏపీ ప్రభుత్వం నిలదీస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచి అరకొరగా తగ్గించి ధర్నాలు అంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడింది. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే తాము ఈ ప్రకటన ఇస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.