Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /politics /

Amit Shah: టీడీపీకి బూస్ట్ ఇచ్చిన అమిత్ షా వ్యాఖ్యలు.. ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఇదే

Amit Shah: టీడీపీకి బూస్ట్ ఇచ్చిన అమిత్ షా వ్యాఖ్యలు.. ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఇదే

వైసీపీపై పోరాడాలని అమిత్ షా పిలుపు

వైసీపీపై పోరాడాలని అమిత్ షా పిలుపు

Amit Shah: 2024లో ఏపీలో అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఓ వైపు అధికార వైసీపీ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడాలని.. టీడీపీతోనే సమాన దూరం పాటించాలని సూచించిన ఆయన.. తరువాత అంతర్గతంగా జరిగిన సమావేశంలో టీడీపీకి బూస్ట్ ఇచ్చే వ్యాఖలు చేశారని సమాచారం. ముఖ్యంగా టీడీపికి వ్యతిరేకంగా ఉన్న ఆ ఇద్దరు నేతలకు గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

Amit Shah on YCP and TDP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తమ పార్టీ స్ట్రాటజీ ఏంటో అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. 2024 అధికారం దిశగా అడుగులు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అధికార వైసీపీ (YCP)తో కేంద్రం సంత్సంబంధాలు కొనసాగిస్తోందని.. అదే సమయంలో టీడీపీ (tdp)తో అవసరాన్ని బట్టి తరువాత చూద్దాం అనే దోరణిలో వెళ్తున్నట్టు ప్రచారం ఉంది. ఈ అనుమానాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah)క్లారిటీ ఇచ్చారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రెండు పార్టీలతో ఎలా వ్యవహరించాలి అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ప్రజా వ్యతిరేకత పెరిగిందని.. కచ్చితంగా వైసీపీ తీరుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు. అలాగే టీడీపీ (Tdp)తోనూ సమాన దూరం పాటించాలి అన్నారు. దీనికి తోడు జనసేనతో పొత్తు ఉందని.. ఆ పార్టీతో కలిసి అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్లాలి అన్నారు. అయితే బహిరంగ సమావేశంలో ఈ మాటలు అన్న అమిత్ షా.. తరువాత అంతర్గత సమావేశంలో పార్టీ స్ట్రాటజీపై కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

పార్టీ సమావేశం ముగిసిన తరువాత.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి.. సీఎం రమేష్ లతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. ఈ సమంలో టీడీపీతో పొత్తు.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తామన్నదానిపై వారికి స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అప్పటి వరకు సంయమంనంతో వ్యాఖ్యలు చేస్తూ ఉండాలని.. పార్టీ లైన్ దాటకుండా జాగ్రత్త పడాలని సూచించినట్టు తెలుస్తోంది. అయితే వారిద్దరితో మాట్లాడిన తరువాత.. టీడీపీ అంటే అంత ఎత్తున లేచే జీవీఎల్, సునీల్ దేవ్ ధర్ లకు అమిత్ షా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది..

ఇదీ చదవండి : కుప్పంలో యుద్ధ వాతావరణం.. విశాఖలో పోటాపోటీ దాడులు.. ఫిర్యాదులతో ముగిసిన పోలింగ్

ముఖ్యంగా ఏపీలో బీజేపీకి వైసీపీనే ప్రధాన శత్రువు అని పార్టీ అంతర్గత సమావేశంలో అమిత్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. వైసీపీకి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపు ఇచ్చారని.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రాజధాని.. అది అమరావతి అన్నది బీజేపీ స్టాండ్ అని.. బీజేపీ నేతలు.. అమరావతి రైతుల పోరాటానికి మద్ధతు తెలపాలని అమిత్ షా సూచించారు. ఆ విషయంలోనే జీవీఎల్, సునీల్ దేవ్ దర్ లకు క్లాస్ పీకినట్టు సమాచారం.. ఇక పొత్తుల విషయంలోపై ఇప్పుడు ఎవరూ మాట్లాడ వద్దని.. ప్రస్తుతం జనసేనతో కలిసి పోరాటాలు చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది.. అమిత్ షా చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఏపీలో టీడీపీ పూర్తి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మరి అమిత్ షా సూచనల మేరకు బీజేపీ నేతలు అమరావతి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు మరింత ముదిరే అవకాశం ఉంది..

ఇదీ చదవండి : పొలిటికల్ పంచ్ లే కాదు.. ఆటల్లోనూ అదుర్స్ అనిపిస్తున్న ఎమ్మెల్యే రోజా.. త్రో బాల్ పిక్స్ వైరల్

దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీ కోసం తిరుపతి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పనిలో పనిగా ఏపీ బీజేపీ తాజా పరిస్ధితిపై దాదాపు గంటన్నర సేపు ఇవాళ రివ్యూ చేశారు. అందులో బీజేపీ నేతల నుంచి స్ధానికంగా ఉండే ఇన్ పుట్స్ ను తీసుకున్న అమిత్ షా వాటిని తనకున్న ఇన్ ఫుట్స్ తో మ్యాచ్ చేస్తూ వారికి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఏపీలో మారబోతున్న పరిస్ధితులపై బీజేపీ నేతలకు ఆయన సంకేతాలు ఇచ్చారు. నేతలు చేయాల్సిన కార్యక్రమాల్ని కూడా సూచించారు. వీటిని తూచా తప్పకుండా పాటించాలని బీజేపీ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి : శ్రీరాముడి కంట నీరు.. భయంతో క్యూ కట్టిన భక్తులు.. ఏదో జరగబోతోంది అంటూ ఆందోళన

ఇన్నాళ్లు రాష్ట్రంలో అధికార వైసీపీతో కేంద్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోందని అంతా భావిస్తున్న తరుణంలో హోంమంత్రి అమిత్ షా ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని నేతలకు వెల్లడించారు. తనకున్న సమాచారం మేరకు ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ బీజేపీకి చెందిన రాష్ట్రస్ధాయి నేతలు సోము వీర్రాజు, సీఎం రమేష్, సుజనా చౌదరి నుంచి కూడా ఆయన ఇన్ పుట్స్ తీసుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Bjp, TDP

ఉత్తమ కథలు