హోమ్ /వార్తలు /National రాజకీయం /

Minster on Pawan: ఇన్నిరోజులు గుడ్డి గాడిద పళ్లు తోమారా? పవన్‌ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Minster on Pawan: ఇన్నిరోజులు గుడ్డి గాడిద పళ్లు తోమారా? పవన్‌ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

pawan kalyan

pawan kalyan

AP Minster on Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయంగా మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. స్టీల్ ప్లాంట్ (Steel Plant) ప్రైవేటీకరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దీంతో అదే స్థాయిలో మంత్రులు ఆయనకు కౌంటర్ ఇస్తున్నారు.

ఇంకా చదవండి ...

AP Minster fire on Pawan Kalyan:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. ఓ వైపు బద్వేల్ బై పోల్ (Badvel By poll) కౌంటింగ్.. మరోవైపు మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, ఎమ్మెల్యే ఎన్నికలతో ఇలా మొత్తం రాజకీయంగా హీట్ కనిపిస్తోంది. ఇదే సమయంలో అధికార వైసీపీ - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant)కోసం ఉద్యమిస్తున్న వారికి జనసేనాని పవన్ కల్యాణ్ సంఘీభావాన్ని ప్రకటించారు. నిన్న వైజాగ్ వెళ్లిన పవన్ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేస్తూ, వైసీపీ (YCP)పై మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏదో ఒకటి తేల్చుకోవాలని… వారం రోజులు టైమ్ ఇస్తున్నానని డెడ్ లైన్ పెట్టారు. ఆ తర్వాత మీకు గడ్డుకాలమే అంటూ హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా ఏపీ మంత్రి అప్పలరాజు (Minster Appalaraju) మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ఇన్ని రోజులు గుడ్డి గాడిద పళ్లు తోమారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలనుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని… అలాంటప్పుడు బీజేపీ (BJP)ని ప్రశ్నించాలని అన్నారు.

బీజేపీని పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా అనడం లేదని అప్పలరాజు విమర్శించారు. వ్రైవేటీకరణ అంశంలో వైసీపీకి సంబంధం లేకపోయినా తమ పార్టీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్న బీజేపీకి తిరుపతి, బద్వేల్ ఎన్నికల్లో పవన్ ఎలా మద్దతిచ్చారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కమెడియన్.. పోటీ చేసేది ఎక్కడ నుంచి అంటే..?

ఇన్ని రోజులు పవన్ ఎక్కడికి వెళ్లారు? తన రాజకీయ లబ్ది కోసం పవన్ సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇది ముమ్మాటికి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ అన్నారు. అఖిలపక్షం వేస్తే పోరాడతానని ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ విధించడం ఏంటి? అసలు మాకు టైమ్ విధించడానికి పవన్ ఎవరు? అని మంత్రి అప్పలరాజు నిలదీశారు.

ఇదీ చదవండి: ఉల్లాసంగా ఉత్సాహంగా ఉప రాష్ట్రపతి మార్నింగ్ వాక్.. ఈ వయసులో ఫిట్ నెస్ సీక్రెట్ అదే..

గత ఆరు నెలలుగా విశాఖ ఉక్కు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకొచ్చారు. మరి ఆయన ఏం చేశారో చెప్పాలన్నారు. సినిమా షూటింగ్‌లో బిజీనా, లేక విహార యాత్రలో బిజీగా ఉన్నారా? అంటూ విమర్శించారు. ఎక్కడ తమకు క్రెడిట్ దక్కుతుందో అన్న భయంతోనే సడన్‌గా ఊడిపడి.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేపడుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టులు చదవడం మానుకొని, తనకు తానుగా ఏమైనా విమర్శలు చేయగలరా? అంటూ పవన్‌ను ఎద్దేవా చేశారు మంత్రి అప్పలరాజు. పవన్ కళ్యాణ్ ముందుగా దృతరాష్టుడి చెర నుంచి బయటపడే పనిలో ఉంటే మంచిదని హితవు పలికారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan, Ycp

ఉత్తమ కథలు