P. Anand Mohan, Visakhapatnam, News18, Pawan vizag tour update: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) మరింత రసవత్తరంగా మారుతున్నాయి. బీజీపీతో జనసేన (BJP-Janasena) పొత్తు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖపట్నం (Visakhapatnam)లో ఉన్నారు. మూడు రోజుల పాటు ఆయన విశాఖలో పర్యటిస్తారు. దీంతో ఆయన విశాఖ పర్యటన ఏపీ బీజేపీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ఉక్కు ఉద్యమంలో జనసేనాని భాగం కానున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. కేంద్రంపై తన గళం వినిపించేందుకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సిద్ధమయ్యారు. ఇప్పటికే విశాఖ చేరుకున్న ఆయన మొదట స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత బహిరంగ సభలో బీజేపీపై విమర్శలు చేశారు. ఇదే ఇప్పుడు బీజేపీ నేతలను కన్ఫ్యూజ్ చేస్తోంది.
పవన్ తో వేదికపై ఉన్నది కేవలం కార్మిక సంఘాల నాయకులు మాత్రమే. బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్.. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విశాఖ ఉక్కు భావోద్వేగాలతో ముడిపడిన అంశమంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి పవన్‌కల్యాణ్ తీసుకెళ్లారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. 34మంది ప్రాణ త్యాగాలతో ఆ కర్మాగారం ఏర్పాటైందనే విషయాన్ని అమిత్‌షాకు వివరించారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగానే అడుగులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్న ఉక్కు ఉద్యమకారులకు మద్దతు తెలపడంతో ఏం జరుగుతోందనే ఆసక్తి పెరిగింది.
కేంద్రంలో ఉన్న బీజేపీ.. విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రయివేట్ పరం చేయాలనీ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్ణయానికి వ్యక్తిరేకంగా పవన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని మరోసారి తెరపైకి తీసుకు వచ్చారు. ఉద్యోగుల ఆందోళలకు మద్దతు పలికారు. ఇదే సర్వత్రా చర్చనీయాంశమయింది. విశాఖలోనే జనసేనాని మంగళవారం వరకూ ఉండి.. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు.
దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులలో అంతర్గత చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఆంధ్ర రాజకీయాలలో బిజెపి జనసేన మిత్రపక్షంగా ఎన్నికలకు వెళుతున్న సమయంలో, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణా నినాదం బీజేపీ శ్రేణులకు తలనొప్పిగా తయారైంది.
పవన్ కళ్యాణ్ విమర్శలకు కౌంటర్ ఇవ్వాలా వద్దా.. ఇస్తే భవిష్యత్ లో బీజేపీ, జనసేన మిత్ర బంధం ఎలా ఉంటుంది అన్నదానిపై చర్చించుకుంటున్నారు. ఇప్పటికి కేవలం ఎన్నికల పొత్తులే ఇరు పార్టీల మధ్య ఉన్నాయని జనసేన తేల్చి చెప్తుంది. ఇక పార్టీ విధానాలు, నిర్ణయాలు ఎవరివి వారివే అని అంటున్నారు. కానీ అలా ఉండటం సాధ్యమేనా అన్నది కూడా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: నాన్న లేడు.. అమ్మ రాదు.. ఆధార్ లేదని అధికారులు వదిలేశారు.. అయ్యో జ్యోతి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్న తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని మార్చుకోవాలని పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. ఉద్యమం ప్రారంభమైన తొలి రోజుల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, కేంద్ర పెద్దలతో విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు. ఇకపైనైనా కేంద్రానికి వ్యతిరేకంగా పవన్ పోరాడాలని నిర్ణయించుకుంటే.. రెండు పార్టీల బంధానికి బీటలు వారినట్టే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP News, AP Politics, Bjp-janasena, Janasena, Pawan kalyan, Vizag Steel Plant