అమరావతి ఉద్యమకారులకు పోలీసుల షాక్..

Amaravati : ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఉద్యమం చేపట్టిన ఉద్యమకారులకు పోలీసులు షాక్ ఇచ్చారు. వెంటకపాలెం గ్రామస్తులకు నోటీసులు జారీ చేస్తూ, ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశించారు.

news18-telugu
Updated: April 13, 2020, 11:53 AM IST
అమరావతి ఉద్యమకారులకు పోలీసుల షాక్..
అమరావతి ఆందోళనలు (File)
  • Share this:
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఉద్యమం చేపట్టిన ఉద్యమకారులకు పోలీసులు షాక్ ఇచ్చారు. వెంటకపాలెం గ్రామస్తులకు నోటీసులు జారీ చేస్తూ, ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశించారు. ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 ఉన్నా అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని, లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నా పట్టించుకోలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 11న 11 గంటలకు యూనియన్ బ్యాంక్ సమీపంలో ఎవరి ఇళ్లలో వారు అమరావతి జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం, 12వ తేదీ నుంచి 15 మంది ఉద్యమం చేస్తున్నారని లాక్‌డౌన్ సమయంలో వీరు బయట తిరగడం, కలవడం ఏంటని ప్రశ్నించారు.

జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున.. దాన్ని ఉల్లంఘించినందుకు సెక్షన్ 188, 269, 270, 271 ఐపీసీ ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ‘మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో కారణాలు తెలియజేయాలి' అంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
First published: April 13, 2020, 11:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading