Pattabhi Arrest: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్‌.. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు

టీడీపీ నేత పట్టాభి (ఫైల్ ఫోటో)

Pattabhi Arrest: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Share this:
    ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం తలుపులు పగలగొట్టి ఆయన ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారనే అంశంపై వివరాలు తెలియాల్సి ఉంది. పట్టాభి (Pattabhi) అరెస్ట్‌కు ముందు ఆయన నివాసం దగ్గర హైడ్రామా నడిచింది. ఆయనను అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్న పోలీసులు.. ముందుగా అక్కడ పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించడంతో పట్టాభి అరెస్ట్ ఖాయమని భావించిన టీడీపీ (TDP) శ్రేణులు.. మధ్యాహ్నం నుంచే అక్కడికి చేరుకోవడం మొదలుపెట్టాయి. టీడీపీ మహిళా కార్యకర్తలు, కార్పొరేటర్లు, విజయవాడ(Vijayawada)కు చెందిన పార్టీ నేతలు పట్టాభి ఇంటి దగ్గరకు చేరుకున్నారు.

    అయితే పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, నేతలు అక్కడి నుంచి పంపించేశారు. ఆ తరువాత పట్టాభి ఇంట్లో నుంచి బయటకు రావాలని మైక్‌లో ప్రకటించారు. అయితే పట్టాభి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో.. పోలీసుల తలుపులు పగలగొట్టి ఆయనను బయటకు తీసుకొచ్చారు. దీనిపై ఆయన భార్య పోలీసులు, ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎఫ్ఐఆర్‌ సహా ఏ సమాచారం ఇవ్వకుండానే పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారని పట్టాభి భార్య ఆరోపించారు.

    తన భర్త పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంటిపై దాడి చేసిన వారి అరెస్ట్ చేయకుండా.. తన భర్తను అరెస్ట్ చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. తన భర్తను పడమట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళుతున్నట్టు కొందరు పోలీసులు తెలిపారని ఆమె అన్నారు. తన భర్త అరెస్ట్‌పై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

    Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

    Avoid Diabetes: డయాబెటిస్ రావొద్దని కోరుకుంటున్నారా ? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..

    నిన్న మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేయడంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటి తరువాత ఆయన ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఫర్నీచర్, వాహనాలను ధ్వంసం చేశాయి. కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పలువురిపై దాడి చేశారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: