జగన్‌కు అధికారం ఇవ్వడంలో ఏపీ ప్రజలకు ఫుల్ క్లారిటీ.. విలక్షణ తీర్పు ఇచ్చి..

AP Elections 2019: ఎన్నికల ఫలితాలకు ముందు.. ఏపీలో హంగ్ వస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా సీట్లు సాధిస్తాయని చెప్పారు.కానీ అలాంటిదేమీ జరగలేదు.

news18-telugu
Updated: May 24, 2019, 5:37 PM IST
జగన్‌కు అధికారం ఇవ్వడంలో ఏపీ ప్రజలకు ఫుల్ క్లారిటీ.. విలక్షణ తీర్పు ఇచ్చి..
చంద్రబాబు, జగన్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కీలక తీర్పు ఇచ్చారు. ఐదేళ్లకే టీడీపీ సర్కారుపై విరక్తి చెందిన ఓటర్లు.. వైసీపీ అధినేత జగన్‌కు అధికారం కట్టబెట్టారు. అయితే, ఎవరికి అధికారం కట్టబెట్టాలన్న అంశంలో ఏపీ ప్రజలు ఫుల్ క్లారిటీలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. హంగ్ అనే సమస్యే రాకుండా ఒక పార్టీకే అధికారం ఇచ్చారు. నిజానికి ఏపీలో టీడీపీ, వైసీపీ బలమైన పార్టీలు. ఇందులో ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తాయి. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల ఫలితాలకు ముందు హంగ్ వస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. పోటాపోటీగా సీట్లు సాధిస్తాయని చెప్పారు. హంగ్ వస్తుందని, ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కానీ, అలాంటి పరిస్థితి రాకుండా ఏపీ ప్రజలు జాగ్రత్త పడ్డట్లు కనిపిస్తోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ పనితీరును బేరీజు వేసుకొని ఒక నిర్ధారణకు వచ్చినట్లు అనిపిస్తోంది. ఆ క్లారిటీతోనే ఒక్క పార్టీకే మెజారిటీ ఇచ్చారు. వైసీపీ 151, టీడీపీకి 23, జనసేనకు ఒక సీటు ఇచ్చారు.

అచ్చం ఇలాంటి తీర్పునే 2014లోనూ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే(టీడీపీ 103+ బీజేపీ 4)కు పట్టం కట్టారు. వైసీపీని 66 సీట్లలో గెలిపించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ రెండూ బలమైన పార్టీలైనా హంగ్ రాకుండా జాగ్రత్త పడ్డారు ఏపీ ప్రజలు. ఇలా ఎన్నికకు.. మరో ఎన్నికకు విలక్షణమైన తీర్పు ఇచ్చి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

First published: May 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు