ANDHRA PRADESH PANCHAYATHI ELECTIONS BECOME MORE COSTLY
AP Panchayat Elections: ఏపీలో కాస్టలీగా మారిన పంచాయితీ ఎన్నికలు, తొలి విడతలో ఆ పంచాయితీలు చాలా కీలకం!
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు
ఏపీలో కాస్టలీగా మారిన పంచాయితీ ఎన్నికలు. తొలివిడతలో ఆ 15 పంచాయితీలు చాలా కీలకం...అక్కడ అభ్యర్దల ఖర్చలు కూడా భారీగానే ఉన్నాయి. ఒక్క పంచాయితీలో కోటి నుంచి అర కోటి దాటిపోతున్న అభ్యర్దలు ఖర్చలు....నేతల పై పడుతున్న ఈ భారం.
ఏపీలో ఏ గ్రామం చూసిన పంచాయితీ ఎన్నికల హడవిడే కనిపిస్తోంది. వీలైనన్ని గ్రామాలను ఏకాగ్రీవం చేయడానికి అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తోంటే... అవకాశం ఉన్న దగ్గర గట్టి పోటీ ఇవ్వాలని ప్రతిపక్ష టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే అధికారపార్టీలో మంత్రుల దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యేలు వరకు తమ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు ఏకాగ్రీవాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోన్నారు. మరో వైపు ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి కూడా స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు, పార్టీలో కీలక కేడర్ కు 80 నుంచి 90 శాతం గ్రామాలను ఏకగ్రీవం చేయించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో... నేతలందరూ ఇప్పుడ గ్రౌండ్ లో స్థాయిలో ఉండి అన్ని పనులు చూసుకుంటున్నారు.
అయితే ఇక్కడదాక బాగానే ఉంది కాని ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడిందంటున్నారు నేతలు అధినేత ఆదేశాలతో అన్ని ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేయడంలో భాగంగా ఈ పంచాయితీ ఎన్నికలు చాలా కాస్ట్లీగా తయారువుతున్నాయంటా. అభ్యర్దలు దాదాపు కోటీ నుంచి కోటిన్నర వరకు ఖర్చు చేయాల్సి రావడంతో అమ్మో అని చెతిలెత్తేస్తోన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఖర్చు కూడా స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ మంత్రులపైనే పడుతుందంటా. ఇప్పటికే గత ఎన్నికల్లో అన్ని అమ్ముకొని, భారీగా ఖర్చు చేసి గెలిస్తే ఈ ఖర్చులు పార్టీ నేతలకు తలకుమించిన భారంగా మారిందని టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు రిజ్వర్డ్ పంచాయితీలు అధికారపార్టీకి పెద్ద సవాలుగా మారిందని తెలుస్తోంది. తొలివిడతలో ఎన్నికలు జరుగుతున్న అనకాపల్లిలో మేజర్ పంచాయితీలు పార్టీ నేతలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. మొత్తం 15 మేజర్ పంచాయితీల్లో అధిక శాతం రిజర్వ్ అయిపోయినట్లు తెలుస్తోంది.
ఈ పంచాయితీల్లో ఓటర్ల సంఖ్య కాస్త అటు ఇటుగా పది వేలు దీంతో ఇక్కడ అభ్యర్ధల ఖర్చ కూడా తడిసిమోపుడవుతుందని తెలుస్తోంది. కనీసం, కోటీ రూపాయిలు లేదంటే కష్టం అనే స్థాయికి మొదటి నుంచే అభ్యర్ధులు పార్టీ లు కూడా వచ్చేశాయి. దీంతో అధికారపార్టీ ఆ మేరకు ఖర్చు చేసే అభ్యర్ధల వేట ప్రారంభించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో నేతలు చేసేది లేక స్థానిక నేతలకు డబ్బులు సమకూర్చే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఖర్చుల కాస్త మీరు సర్దుబాటు చేయండి గెలిచేది మనమే కాబట్టి తరువాత మీకు చూస్తాం అని చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే క్రింది స్థాయి నాయకత్వం మాత్రం ఈ ప్రతిపాధనకు అంత సముఖంగా లేనట్లు తెలుస్తోంది. పదవులు మీకు ఖర్చులు మాకా మా వల్ల కాదని బహిరంగానే చెబుతున్నట్లు ఈ పంచాయితీల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
Published by:Balakrishna Medabayani
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.