• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS YELAMANCHILI YSRCP MLA KANNABABU RAJU ARRESTED FOR THREATENING CANDIDATE BA

AP Panchayat Elections: పెద్దిరెడ్డి తర్వాత మరో షాకింగ్.. వైసీపీ ఎమ్మెల్యే అరెస్టు

AP Panchayat Elections: పెద్దిరెడ్డి తర్వాత మరో షాకింగ్.. వైసీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని బెదిరించిన కేసులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే యూ.వి.రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబురాజును పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని బెదిరించిన కేసులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే యూ.వి.రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబురాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు సొంత పూచికత్తు మీద బెయిల్ ఇచ్చింది. విశాఖ జిల్లాలో లాలంకోడూరులో వైసీపీ రెబల్ అభ్యర్థి సత్యం పోటీకి దిగారు. ఏకగ్రీవం అనుకున్న చోట పోటీ కనిపించడంతో ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆగ్రహించారు. అభ్యర్థి బంధువును ఫోన్ లో హెచ్చరించారు కన్నబాబురాజు. దీనికి సంబంధించి వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ఇతర పార్టీల నేతలు కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అభ్యర్థిని బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బెదిరింపులకు సంబంధించిన సంబంధించిన ఆడియో రికార్డులు, బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యేపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశ పెట్టారు. అక్కడ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆ గ్రామంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అవ్వాలని కన్నబాబు రాజు హెచ్చరించారు. వైసీపీ అభ్యర్థి గెలవాలని, లేదా గెలిచిన అభ్యర్థి వైసీపీ వాళ్లు అవుతారని హెచ్చరించారు.

    తన మీద వచ్చిన ఆడియోలపై వైసీపీ ఎమ్మెల్యే స్పందించారు. అభ్యర్ధి ని బెదిరించి ఏకగ్రీవాలు చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఎప్పుడో మాట్లాడిన మాటలను, ఇప్పటి సంభాషణలకు అతికించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరినైనా బలవంతంగా ఎన్నికల నుంచి తప్పుకోమని చెప్పినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు.

    ఆంధ్రప్రదేశ్‌లో పరిమితికి మించి పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయితే వాటిపై స్పెషల్ ఫోకస్ పెడతామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. దీంతోపాటు తాజాగా, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో పెండింగ్ లో పెట్టాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించకూడదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలపై ఎలాంటి ప్రకటన చేయరాదని గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఏకగ్రీవమైన పంచాయతీలపై పూర్తి నివేదికను ఎన్నికల కమిషన్ కు పంపాలన్న ఆయన.. నివేదికలు పరిశీలించిన అనంతరం అవసరమైన చర్యలు తీసకుంటామని స్పష్టం చేశారు.

    ఏకగ్రీవాలకు సంబంధించి ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి తప్పుపట్టారు. అలాగే, నిమ్మగడ్డ చెప్పినట్టు చేసి అక్రమంగా ఏకగ్రీవాలను అడ్డుకుంటే ఆయా అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన నిమ్మగడ్డ ఏకంగా మంత్రిని హౌస్ అరెస్టు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఎన్నికలు సజావుగా సాగాలంటే ఈనెల 21 వరకు ఆయన్ను ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని, అలాగే, మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని ఆదేశించారు. ఎస్ఈసీ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. దీనిపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: