ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం...

సంక్రాంతికి ముందే స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. కొత్త సంవత్సర ప్రారంభం నుంచే హడావిడి నెలకొనబోతోంది.

news18-telugu
Updated: November 30, 2019, 9:19 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. డిసెంబరు 15కు బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేయనున్నారు. జనవరి 10న రిజర్వేషన్ల జాబితా ఖరారు కానున్నాయి. ఆ మరుసటి రోజు నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా సంక్రాంతికి పల్లెల్లో సందడిగా వుంటుంది. అయితే ఈసారి అంతకుముందుగానే గ్రామాల్లో మరింత సందడి ఏర్పడబోతోంది. సంక్రాంతికి ముందే స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. కొత్త సంవత్సర ప్రారంభం నుంచే హడావిడి నెలకొనబోతోంది. డిసెంబరు 15నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. జనవరి 10న పంచాయతీల రిజర్వేషన్లు ఫైనల్‌చేస్తే మరుసటి రోజునుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుంది.

గుంటూరు జిల్లాలో పంచాయతీలు: 1029

వార్డు మెంబర్లు: 11,714 మంది

మేజర్‌ పంచాయతీలు:112మైనర్‌ పంచాయతీలు: 919

డివిజన్‌ల వారీగా మేజర్‌, మైనర్‌ పంచాయతీల వివరాలు

డివిజన్‌- పంచాయతీలు-మేజర్‌-మైనర్‌గుంటూరు - 305 - 33 - 274
తెనాలి - 349 - 67 - 282
నరసరావుపేట - 375 - 12 - 363
మొత్తం - 1,029 - 112 - 919

బ్యాలెట్‌ పేపర్‌ రంగు...
వార్డు మెంబర్‌ : తెలుపు
సర్పంచ్‌ : గులాబి
First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>