• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS COUNTING GOING ON YSRCP DOMINATES INITIAL RESULTS HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తొలి ఫలితాలు ఇవే.. వైసీపీదే హవా

AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తొలి ఫలితాలు ఇవే.. వైసీపీదే హవా

పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతున్న కౌంటింగ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) తొలిదశ పోలింగ్ ముగిసింది. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెలువడుతున్నాయి. 3.30 గంటలకు పోలింగ్ ముగిసింది. 4గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెలువడుతున్నాయి. 3.30 గంటలకు పోలింగ్ ముగిసింది. 4గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల్లో 7,506 మంది... వార్డులకు 43,601 మంది పోటీలో నిలిచారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 500 పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు, 18 చోట్ల వైసీపీ మద్దతుదారులు, 7చోట్ల ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించగా.. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు రెండో స్థానంలో నిలుస్తున్నారు.

    జిల్లాల వారీగా వెలువడిన ఫలితాలు

    • శ్రీకాకుళం(321): వైసీపీ మద్దతుదారులు - 39, టీడీపీ మద్దతుదారులు - 0

    • విశాఖపట్నం (340): వైసీపీ మద్దతుదారులు- 42, టీడీపీ మద్దతుదారులు- 1, ఇతరులు - 1

    • తూర్పుగోదావరి (366): వైసీపీ మద్దతుదారులు 29, టీడీపీ మద్దతుదారులు-0, ఇతరులు 1

    • పశ్చిమగోదావరి (239): వైసీపీ మద్దతుదారులు- 38, టీడీపీ మద్దతుదారులు-0, ఇతరులు 3

    • కృష్ణా (234): వైసీపీ మద్దతుదారులు - 21, టీడీపీ మద్దతుదారులు -2

    • గుంటూరు(337): వైసీపీ మద్దతుదారులు-65, టీడీపీ మద్దతుదారులు-2

    • ప్రకాశం(227): వైసీపీ మద్దతుదారులు - 31, టీడీపీ మద్దతుదారులు-4, ఇతరులు 0

    • నెల్లూరు జిల్లా (163): వైసీపీ మద్దతుదారులు - 22, టీడీపీ మద్దతుదారులు -2, ఇతరులు - 1

    • కడప జిల్లా (206): వైసీపీ మద్దతుదారులు - 51, టీడీపీ మద్దతుదారులు 0, ఇతరులు 0

    • అనంతపురం(169): వైసీపీ మద్దతుదారులు - 6, టీడీపీ మద్దతుదారులు - 0

    • చిత్తూరు (454): వైసీపీ మద్దతుదారులు - 106, టీడీపీ మద్దతుదారుల - 6

    • కర్నూలు(193): వైసీపీ మద్దతుదారులు - 50, టీడీపీ మద్దతుదారులు - 1, ఇతరులు – 1


    తొలి విడత ఫలితాలు వెలువడుతున్న దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.
    Published by:Purna Chandra
    First published: