Home /News /politics /

ANDHRA PRADESH OPPOSITION PARTIES TDP AND BJP DEMANDS SEC TO IMPLEMENT ONLINE NOMINATIONS FOR PANCHAYAT ELECTIONS PRN

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై ప్రతిపక్షాల కొత్త రాగం... ఆ డిమాండ్ కు ఎస్ఈసీ ఒప్పుకుంటారా..?

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) హడావిడి జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకగ్రీవాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని.., ప్రతిపక్షాలు బలపర్చే అభ్యర్థులను పోటీ చేయనీయకుండా బెదిరిస్తున్నారని టీడీపీ, జనసేన, టీడీపీలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్ లైన్ నామినేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

    ఆన్ లైన్లో స్వీకరించాల్సిందే..!
    పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వానికి అడ్డుకట్ట వేయాలంటే ఆన్ లైన్ నామినేషన్లు ఒక్కటే మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఏకగ్రీవాల పేరుతో ప్రతిపక్ష అభ్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ దాడులను అరికట్టాలని ఎస్ఈసీని కోరారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలను పునరావృతం కాకుండా ఉంటే ఆన్ లైన్ నామినేషన్ ఒక్కటే మార్గమని.., అలాగే అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్ వేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

    ఎస్ఈసీ దృష్టి
    ఇక కలెక్టర్లు, ఉన్నతాధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.., ఏకగ్రీవాలపైనే దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చేరు. బలవంతపు ఏకగ్రీవాలు ఎక్కడ జరిగినా అడ్డుకోవాలన్నారు.., తమ ప్రాధాన్యం ఎన్నికలు నిర్వహించడమేనన్నారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని ఆదేశించారు. ఏకగ్రీవాల సంఖ్య అపరిమితంగా పెరిగితే ఖచ్చితంగా జోక్యం చేసుకుంటామన్నారు నిమ్మగడ్డ.

    నిమ్మగడ్డ మనసులో ఏముందో..
    ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు యత్నిస్తోందని.. ఎస్ఈసీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐతే నామినేషన్ ప్రక్రియకు పెద్దగా సమయం లేకపోవడం, గతంలో అలాంటి సాంప్రదాయం లేకపోవడంతో మార్పులు జరిగే అవకాశం లేదని రాజకీయ వర్గాలంటున్నాయి. ఒకవేళ ఆన్ లైన్ నామినేన్లు స్వీకరించాలని భావించినా.., అది ఇప్పటకిప్పుడు సాధ్యమయ్యే అవకాశం లేదు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Bjp, Gram Panchayat Elections, Nimmagadda Ramesh Kumar, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు