Home /News /politics /

ANDHRA PRADESH NEWS YCP GOVERNMENT COUNTER ATTACK ON BJP AGAINST PETROL PRICES NGS

AP Politics: బీజేపీ వర్సెస్ వైసీపీ.. కేంద్రం తీరుపై కౌంటర్ ఎటాక్.. పత్రికల్లో ప్రకటనలు.. వాస్తవం ఏంటి..?

ఏపీ ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం

YCP Vs BJP: కేంద్రంపై ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దూకుడు పెంచింది. పదే పదే రాష్ట్ర బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో.. వైసీపీ కూడా కౌంటర్ ఎటాక్ కు దిగుతోంది. ముఖ్యంగా బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం తరువాత బీజేపీకి అంత సీన్ లేదని అధికార పార్టీ అభిప్రాయానికి వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతోనే పేపర్లో ప్రకటనలు వేసి మరి కౌంటర్ ఎటాక్ మొదలెట్టింది..

ఇంకా చదవండి ...
    Andhra Pradesh Politics YCP Vs BJP:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పెట్రోల్ ధరలు (Petrol Price) రాజకీయ మంటకు కారణమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎక్సైజ్ పన్ను తగ్గించిన తరువాత పలు రాష్ట్రాలు.. పెట్రోల్ ధరలు తగ్గించాయి.. కానీ ఏపీ ప్రభుత్వ (Andhra Pradesh Government)మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం విమర్శలు చేశారు. విపక్షాలన్నీ ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ (BJP)నిరసనలకు పిలుపు ఇవ్వగా.. అధికార పార్టీ వైసీపీ (YCP)కౌంటర్ ఎటాక్‌కు దిగింది. బీజేపీ తీరుపై ఏకంగా పత్రికలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత?’అంటూ వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని నేరుగా ప్రశ్నిస్తోంది.

    తప్పు తమది కాదని ప్రజలకు తెలియజేసేందుకు పేపరు ప్రకటన ఇచ్చింది. లీటరు పెట్రోల్ ధరను 100 రూపాలయకు పైగా పెంచి.. ఇప్పుడు కేవలం ఐదు రూపాయలు, పది రూపాయలు తగ్గించామని పెంచినవల్లే నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉందా? అని ఏపీ ప్రభుత్వం నిలదీస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచి అరకొరగా తగ్గించి ధర్నాలు అంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడింది. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే తాము ఈ ప్రకటన ఇస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

    కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 3,35,000 కోట్ల రూపాయల పన్ను వసూలు చేసినప్పటికీ అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం 19,745 కోట్ల రూపాయలు మాత్రమేనని అందులో వివరణ ఇచ్చింది. అంతే కేవలం 5.8 శాతం మాత్రమే అని గుర్తు చేస్తోంది. వాస్తవానికి రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచాల్సి ఉన్నప్పటికీ పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్‌లోకి రాకుండా సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో సుమారు 2,87,500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ మేరకు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా తగ్గించిన విషయం వాస్తవం కాదా అంటూ వైసీపీ ప్రభుత్వం బీజేపీని నిలదీసింది. 2019 మేలో లీటరు పెట్రోల్ ధర 76.89 రూపాయలు ఉంటే.. 2021 నవంబరు 1 నాటికి 115 రూపాయలకు చేరలేదా అని ఆ ప్రకటనలో ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది..?

    ఇదీ చదండి: బిగ్ షాక్ తప్పదా..? లీటరు పెట్రోల్ ధర 200 రూపాయలు దాటుతుందా..?

    తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా వర్షాలు కురవడంతో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని.. దీంతో 2,205 కోట్ల రూపాయలతో రోడ్లను బాగుచేస్తున్నామని, ఇందుకోసం తమ ప్రభుత్వం ప్రత్యేకంగా లీటరు పెట్రోల్‌పై కేవలం ఒక్క రూపాయి మాత్రమే సుంకంగా వసూలు చేస్తున్నట్లు పత్రికా ప్రకటనల ద్వారా వైసీపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇప్పటికే వైసీపీ తీరును విపక్షాలంతా ఏకమై తప్పు పడుతున్నాయి. మరి ఈ పేపరు ప్రకటనకు.. అటు బీజేపీ.. లేద మిత్రపక్షం జనసేన ఎలాంటి కౌంటర్లు ఇస్తుందో చూడాలి. అయితే సామాన్య ప్రజలు మాత్రం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నడ్డి విరుస్తున్నాయని.. ఒకరిపై ఒకరు తప్పు నెట్టుకోవడం మాని.. అత్యవసరంగా మారిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు