Jangananna Atom Bombg for diwali: సినిమాలు (Movies) కావొచ్చు లేదా రాజకీయాలైనా (Politics) కావొచ్చు.. అంతేకాదు బిజినెస్ (Business) రంగంలో అయినా.. క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు అందరూ చూస్తూ ఉంటారు. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వేనకేసుకోవాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విషయానికి వస్తే.. రాష్ట్రంలో క్రేజ్ ఉన్న రాజకీయ నేత ఎవరు అంటే ముందుగా గుర్తుకొచ్చేది సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మాత్రం.. ఆయన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగన్ ను చిన్న మాట అంటేనే పడరు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు.. జగన్ ను తిట్టిన వారిని ద్వేషించడమే కాదు.. జగన్ అంటే ప్రాణం ఇచ్చేందుకైనా రెడీ అనే అభిమానులు కోట్లలోనే ఉన్నారు. ఆయన క్రేజ్ ఏపీలో ఏ ఎన్నిక జరిగినా అధికార పార్టీని విజేతగా నిలుపుతోంది. పార్టీ తరపున ఎవరిని బరిలో దింపినా.. సీఎం జగన్ ను చూస ఘనవిజయాన్ని కట్టబెడుతున్నారు అత్యధిక ఓటర్లు. ఈ నేపథ్యంలో జగన్ క్రేజ్‌ను పలు కంపెనీలు ఉచితంగా వాడేసుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో జగన్ పేరు మీదు పలు పథకాలు ఉన్నాయి.. ఇప్పుడు కొత్త గా దీపావళి (Diwali) సందర్భంగా మార్కెట్ లో సరికొత్త క్రాకర్స్ వచ్చాయి.. వాటిని చూసి వినియోగదారులు షాక్ అవుతున్నారు.
దీపావళి సందర్భంగా పలు రకాల బాణసంచా మార్కెట్లో సందడి చేస్తోంది. భూచక్రాలు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, మతాబులు, రాకెట్లు, వంకాయ బాంబులు వంటివి ఎప్పుడూ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఏపీలో ఈ సారి కొత్తగా జగన్ ఆటం బాంబులు కనువిందు చేస్తున్నాయి. సీఎం జగన్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకుని తమ వ్యాపారాన్ని పెంచుకోవాలని తయారీదారులు ఇలా ప్రయత్నించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం తరువాత కూడా ఈ ఫోటోలు ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యాయి. విపక్ష నేతలపై సెటైర్లు వేస్తూ వైసీపీ అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సీఎం జగన్ ఫోటోతో ఉన్న దివాళీ క్రాకర్స్ ఫోటోలకు.. విపక్ష నేతల ఫోటోలను జోడిస్తే.. అది జగన్ అన్న సత్తా అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు..
Perfect ??#JaganCrackers #EndOfTDP #YSRCPWinsBadvel pic.twitter.com/1A7pqX8MLV
— Manvitha (????) (@ManviDad) November 2, 2021
దీపావళి అంటేనే పటాసులు పేల్చి వేడుకలు చేసుకుంటాం.. అందుకే వాటిని అమ్మేందుకు గల్లీకి రెండు మూడు షాపులు వెలుస్తుంటాయి. వాటిని అమ్మేవ్యాపారులు.. ట్రెండింగ్ లో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకుని టపాసులకు పేర్లు పెడుతుంటారు.. ఎందుకంటే ప్రజలకు బాగా కనెక్ట్ అయిన వాటి పేర్లతో అమ్మితే ఎక్కువగా అమ్ముడుపోతాయన్నది వారి మార్కెట్ స్ట్రాటజీ..
కొందరు వ్యాపారులు తమ ప్రమోషన్స్ కోసం నేరుగా ఏపీ సీఎం జగన్ బొమ్మనే వాడేశారు. ఆయన పేరు మీద చాలా రకాల ఆటం బాంబులు, భూ చక్రాలు, చిచ్చుబుడ్లు లాంటివి తయారు చేశారు. ఇందులో ఆటం బాంబులు చాలా స్పెషల్ గా నిలుస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని గన్నవరం పట్టణంలో వేంగంగా ఈ బాంబులు అమ్ముడుపోతున్నాయని సమాచారం. జగన్ బొమ్మ ఉన్న బాంబులకు మంచి డిమాండ్ ఉంది అంటున్నారు వ్యాపారులు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cm jagan, Diwali 2021