మద్యం అమ్మకాలపై జగన్ కీలక నిర్ణయం.. కొత్త పాలసీ..

రాష్ట్రంలో మద్యపానాన్ని దశలవారీగా అరికట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.

news18-telugu
Updated: August 22, 2019, 3:14 PM IST
మద్యం అమ్మకాలపై జగన్ కీలక నిర్ణయం.. కొత్త పాలసీ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 22, 2019, 3:14 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్లో 1 నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానుంది. కొత్త మద్యం పాలసీ ప్రకారం రాష్ట్రంలో 3500 రిటైల్ మద్యం దుకాణాలు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్‌కు అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ క్రమంలో గ్రామాల్లో బెల్ట్ షాపుల మీద కఠినంగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించే ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. తమిళనాడులో ఈ తరహా విధానం అమల్లో ఉంది. దీన్ని ఏపీలో కూడా అమలు చేసే ప్లాన్‌లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మద్యపానాన్ని దశలవారీగా అరికట్టేందుకు ప్రభుత్వం ఇలా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.

 

First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...